ప్రభాస్ ఇంటి ముందు జపాన్ అమ్మాయిలు హడావిడి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాని కంప్లీట్ చేసి రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాను మూవీ షూటింగ్ కోసం బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే బాహుబలి సినిమా తో ప్రభాస్ ఇమేజ్ ఆసియా ఖండం మొత్తం వ్యాపించేసింది.

ఇప్పటికే బాలీవుడ్ లో లో స్టార్ హీరోల రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ జపాన్ లో కూడా విశేషంగా అభిమానులు ఆకర్షించాడు.ఆ మధ్య జపాన్లో బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడి ప్రజలను బాహుబలి సినిమాలో ప్రతి పాత్ర ఆకట్టుకుంది.

ఆ పాత్రలకు జపాన్ సినీ అభిమానులు కూడా విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.కొంతమంది బాహుబలి సినిమాలో పాత్రలను బొమ్మలుగా చేసి మార్కెట్లో కూడా అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు.

ఇక జపాన్ అమ్మాయిలకు ప్రభాస్ కలల రాకుమారుడిగా మారిపోయాడు.ఈ నేపథ్యంలోనే ఆమధ్య ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జపనీస్ సెలబ్రేట్ చేయడంతో పాటు అతనికి ప్రత్యేకమైన జపనీస్ కల్చర్ బహుమతులు కూడా పంపించారు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా జపాన్ కి చెందిన కొంతమంది అమ్మాయిలు హైదరాబాద్ లో ప్రభాస్ ఇంటికి వెళ్లి అక్కడ రకరకాల భంగిమలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఆ ఫోటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోలను చూసి విపరీతంగా లైక్ చేస్తూ షేర్ చేస్తూ తమ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ని అందరికి పరిచయం చేస్తున్నారు.మొత్తానికి ఈ ఫోటో ద్వారా జపాన్ లో అమ్మాయిలు కూడా ప్రభాస్ విపరీతంగా నచ్చేశాడు అని అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు