ప్రియుడితో కలిసి తిరుమలకు వచ్చిన జాన్వీ.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) తెలుగులో వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ కు జోడీగా ఎన్టీఆర్30 సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమాలో మత్స్యకారుని కూతురి రోల్ లో కనిపించనున్నారని సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఆమె నటన ఉండనుందని తెలుస్తోంది.

 Janhvi Kapoor Visits Tirupati Balaji Temple With Rumoured Boyfriend Shikhar Paha-TeluguStop.com

జాన్వీ కపూర్ ప్రియుడితో కలిసి తాజాగా తిరుమల( Tirumala )లో దర్శనమివ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ప్రియుడితో కలిసి జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాన్వీ ప్రేమకు, పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని అందుకే ఆమె ప్రియుడితో కలిసి కనిపిస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జాన్వీ కపూర్ ప్రియుడు శిఖర్ పహారియా( Shikhar Pahariya ) గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

జాన్వీ కపూర్ తిరుపతిలో ఆలయ పండితుల నుంచి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.

ఎయిర్ పోర్ట్ లో కూడా వాళ్లిద్దరూ కలిసి కనిపించడం గమనార్హం.జాన్వీ తండ్రి శిఖర్ కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించడం గమనార్హం.త్వరలో జాన్వీ పెళ్లికి సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

జాన్వీ కపూర్ ఎన్టీఆర్( Junior NTR ) మూవీకి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకున్నారని తెలుస్తోంది.జాన్వీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జాన్వీ కపూర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood )లో ఆశించిన రేంజ్ లో సక్సెస్ దక్కలేదు.అయితే టాలీవుడ్ లో సక్సెస్ దక్కితే మాత్రం ఆమెకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జాన్వీ కపూర్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో చూడాలి.తెలుగులో కొత్త సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.

జాన్వీ కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube