చరణ్ తో జాన్వీ స్పెషల్ సాంగ్.. మరి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఒకరు.

ఈ భామ ఇప్పుడు తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతుంది.

ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ డాటర్ ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుని తన వైపుకు తిప్పుకుంది.జాన్వీ అందం, నటనకు అక్కడ మంచి పేరు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే సౌత్ ఎంట్రీకి కూడా సిధ్దం అవుతుంది.జాన్వీ కపూర్ దేవర సినిమాతో( Devara Movie ) తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ( NTR ) హీరోగా తెరకెక్కుతున్న దేవర వంటి భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.మరి ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అయ్యిన జాన్వీ కపూర్ కు ఒక స్టార్ హీరో ప్రాజెక్ట్ లో స్పెషల్ సాంగ్ కోసం అడిగినట్టు తెలుస్తుంది.

Advertisement

మరి ఆ ప్రాజెక్ట్ ఏంటంటే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత చేస్తున్న మూవీ గేమ్ ఛేంజర్.( Game Changer Movie ) ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుంది అని మేకర్స్ ఫీల్ అవుతున్నారట.అదే విషయంపై ఈమెను సంప్రదించడానికి కూడా సిద్ధం అవుతున్నట్టు టాక్.ఏది ఏమైనా చరణ్ సరసన జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ కనుక చేస్తే నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయం.

మరి స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు