రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించనున్నారు.
కాగా ఈ సమావేశానికి రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు హాజరుకానున్నారు.ఇందులో ప్రధానంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే టీడీపీ -జనసేన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపటి జనసేన సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







