అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అంటున్న జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ల తాజా మీటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చిన్న సైజు సంచలనాన్ని కలిగించింది రాష్ట్ర మీడియా మొత్తం వీరి కలయికపై రకరకాల వార్తలు ఊహగానాలు ప్రసారం చేసింది … పొత్తు వ్యూహాలతోనే వీరు కలిసారని వీరి మీటింగ్ మొత్తం దీని అజెండాతోనే జరుగుతుందని ,పోత్తులు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయని ,కొన్ని సీట్ల గురించి వాదనలు జరుగుతున్నాయని ఇలా ఎవరికి తోచిన విశ్లేషణలు వారు వినిపించారు .అయితే ఈ కలయికపై తమ అసలు ఉద్దేశాన్ని ప్రకటించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

 Janasena Says That It Is Not Over, It Has Just Started , Pawan Kalyan, Ycp, Cha-TeluguStop.com

పవన్ కళ్యాణ్ అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తి కాదని, ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి అంటూ ఆయన చెప్పుకోచ్చారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అధోగతి పాలు చేసిన వైసీపీ( YCP ) నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్నదే పవన్ కళ్యాణ్ లక్షమని ఆ దిశగా మేము ఒక యాక్షన్ ప్లాన్లు కూడా రూపొందించుకున్నామని, దానిని చంద్రబాబుకు కూడా వివరించడానికి ఆయనను పవన్ కళ్యాణ్ కలిసారు తప్ప సీట్ల పంపిణీ గురించి మరొక దాని గురించి మాట్లాడడానికి కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు .దీనితో వస్తున్న అనేక ఊహగానాలకు చెక్ పెట్టినట్లయింది.

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan-Telugu Political News

రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాంటి మీటింగ్లు మరెన్నో జరుగుతాయని, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు అపరిమితమైన సహజ వనరులు ఉన్నప్పటికీ సమర్ధంగా ఉపయోగించుకోలేని వైసిపి ప్రభుత్వం వల్ల రాష్ట్రం అన్ని రకాలైన నష్టపోయిందని .ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, కొండలను గుట్టలను కూడా వదలకుండా కబ్జా చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేమీ తెలియదని ఆయన ఈ సందర్భంగా విమర్శలు చేశారు.

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan-Telugu Political News

అయితే పవన్ కళ్యాణ్ కి అధికారం మీద యావ లేదని చెప్పడం పట్ల జనసేనలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది .పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడం కోసం తాము పూర్తిస్థాయిలో కష్టపడుతున్నామని రాజకీయంగా చాలామందితో విభేదిస్తూ ఒక లక్ష్యం కోసం బ్రతుకుతున్నామని మరి అ లాంటప్పుడు అధికారం మా ఎజెండా కాదని ఆయన ప్రకటించడం మమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగా ఉందంటూ సోషల్ మీడియా వేదిక కొంతమంది సీనియర్ జనశసేన ఆక్టివిస్తులు అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube