ఏపీలో పవన్ కి ఓటు హక్కు.. సీటు ఎక్కడో ...

రాజకీయ పార్టీ పెట్టి దుమ్ము దులిపేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రాజకీయంగా ఆయన అడుగులు వేగంగానే పడుతున్నాయి.

 Janasena Pawan Kalyan Where To Participate In 2010-TeluguStop.com

కానీ ఆయన మీద ఆరోపణలు కూడా అదే స్థాయిలో గుప్పుమంటున్నాయి.దీంతో ఆయన స్పీడ్ కి కాస్త బ్రేకులు పడుతున్నాయి.

అందుకే ఇకపై తన మీద ఎటువంటి రాజకీయ విమర్శలు రాకుండా పవన్ ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు.

ప్రజా పోరాట యాత్ర పేరుతో వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకెళుతున్నాడు పవన్.కానీ ఇప్పటివరకూ ఆయన ఓటు హక్కు హైదరాబాద్ పరిధిలో ఉంది.ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన ఓటరు.

జనసేన పార్టీ పెట్టి ఏపీలో ప్రధానంగా రాజకీయాలు చేయాలనుకున్న తర్వాత కూడా ఆయన ఓటును ఏపీకి మార్పించు కోలేదు.కొద్ది రోజుల క్రితం విజయవాడలో అమరావతిని ఆపేస్తామన్న ప్రకటన తర్వాత ఆయన ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియా వేదికగా ఆయన మీద సెటైర్లు కూడా భారీ స్థాయిలో వేసేసాయి.

పక్క రాష్ట్రం ఓటరైన పవన్ కల్యాణ్ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని ఆపడేమిటని విమర్శలు ప్రారంభించారు.ఖైతరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో పవన్ కల్యాణ్‌ ఓటర్‌గా ఉన్నట్లుగా ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని బయట పెట్టారు.

దీంతో డైలమాలో పడిన పవన్ వెంటనే ఏలూరులో ఓటర్‌గా నమోదు చేయించుకున్నారు.ఏలూరు శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దానికి పవన్ కల్యాణ్, జనసేన అధినేత అనే నేమ్ బోర్డును కూడా వేలాడ దీశారు.

చిరునామా ధ్రువీకరణ కావాలి కాబట్టి రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు.దాన్ని అడ్రస్ ఫ్రూఫ్‌గా చూపించి ఆన్‌లైన్ లో ఓటర్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నారు.అధికారులు కూడా మంజూరు చేశారు.దీంతో పవన్ ఏలూరు నుంచి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి.

కానీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఎవరికీ ఇంకా ఒక క్లారిటీ లేదు.అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు.శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు అదే మాట చెప్పారు.ఆ తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ పేరు బయటకు వచ్చింది.ఇప్పుడు ఏలూరులో ఓటు నమోదు చేయించుకోవడంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని ఓ అంచనాకు వస్తున్నారు జనసేన కార్యకర్తలు.కానీ పవన్ మనసులో ఏముందో అనేది మాత్రం ఎవరికీ తెలియడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube