మొన్నటి వరకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( YCP AP CM YS Jagan ) ను టార్గెట్ చేసుకుని టిడిపి, జనసేన, బిజెపి లు విమర్శలు చేస్తూ వచ్చాయి.అయితే ఇప్పుడు షర్మిల రూపంలో కాంగ్రెస్ కూడా జగన్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తోంది.
ముఖ్యంగా అన్ని అంశాల పైన షర్మిల ప్రశ్నలు కురిపిస్తూ , తన అన్నను రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు .దీనిలో భాగంగానే జగన్ కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న క్రిస్టియన్ల ఓటు బ్యాంకు కు చీలిక తెచ్చేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.వైసిపి క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉందని, అందుకే మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పై హత్యలు, అత్యాచారాలు జరిగినా జగన్ కనీసం ఆ వ్యవహారంపై స్పందించలేదని, ఇదేనా క్రైస్తవులపై ప్రేమ అంటూ షర్మిల( YS Sharmila ) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా జగన్ కు ఇబ్బందులే తెచ్చిపెట్టాయి .
ఇప్పుడు ఇదే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) కూడా జగన్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. క్రైస్తవులను జగన్ మోసం చేశారని పవన్ మండిపడుతున్నారు .ఏపీ వ్యాప్తంగా 97 వేల మంది పాస్టర్లు ఉన్నారని, వారందరికీ నెల నెల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పిన జగన్ కేవలం 8500 మందికి మాత్రమే ఇచ్చారని, అది కూడా ఎంపిక చేసిన వారికి మాత్రమే ఇస్తున్నారని , ఇది మోసం కాదా ? మిగిలిన వారి సంగతి ఏంటి అంటూ పవన్ ప్రశ్నించారు .ఏపీలో టిడిపి, జనసేన, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే క్రైస్తవులకు మేలు జరిగే విధంగా తాను బాధ్యతలు తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా క్రైస్తవ మతల పెద్దలతో తాజాగా సమావేశం నిర్వహించిన పవన్ జగన్ పై విమర్శలు చేశారు.
తన స్వార్థం కోసం జగన్ క్రైస్తవులను( Christians ) వినియోగించుకుంటున్నారని , తాను క్రిస్టియన్ అని చెప్పుకునే జగన్ ప్రభువు చెప్పిన ఒక్క సిద్ధాంతాన్ని కూడా అనుసరించడం లేదని పవన్ మండిపడ్డారు. పాస్టర్లకు ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 517 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని, వీటిని క్రిస్టియన్ లే చేశారనే విమర్శలు వచ్చాయని, అయినా జగన్ ఈ విషయంపై స్పందించలేదని , అలాంటప్పుడు క్రైస్తవులు జగన్ ను ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.