జనసేన తరపున గత కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు. 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నాగబాబు ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గానే ఉన్నా, ఈ మధ్యకాలంలో పార్టీ తరఫున ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ, తమ రాజకీయ ప్రత్యర్థులపై నాగబాబు విరుచుకుపడుతున్నారు అంతేకాకుండా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపడుతూ మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతూ, 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.
టిడిపి , బిజెపి వంటి పార్టీల విషయంలోనూ ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ను 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన వారికే తమ మద్దతు ఉంటుందంటూ నాగబాబు ప్రకటించి సంచలనం సృష్టించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఏపీ ప్రభుత్వంపై నాగబాబు ఘాటుగా విమర్శలు చేశారు.జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసిన ట్వీట్ ను ఉదహరిస్తూ నాగబాబు కామెంట్స్ చేశారు.” సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులు, వేధింపులు ఆపండి.మీ పాలనకు సిగ్గుచేటు” అప్పుడు టిడిపి ప్రభుత్వం పై జగన్ ఆగ్రహం చేస్తూ చేసిన ట్వీట్ ను నాగబాబు గుర్తు చేశారు.
” ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని వేధించినది మీరు అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలను ఎలా వెంటాడుతున్నారు.మేలుకో సీఎం కనీసం ఇప్పటికైనా ఆపు ” అంటూ అప్పట్లో జగన్ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ నాగబాబు కామెంట్ చేశారు.ఈ తరహాలోని గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగాను నాగబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ … జగన్ పరిపాలనలోని లోపాలను ప్రస్తావిస్తూ, వెటకారం చేస్తూనే వస్తున్నారు.
ఇక వైసిపి నేతలు నాగబాబు చేస్తున్న విమర్శలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.అయితే పార్టీ తరపున నాగబాబు యాక్టివ్ గా ఉండడం, సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్లతో విరుచుకుపడుతుండడంతో జనసేన నాయకులు సైతం ఉత్సాహంగా సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వ పాలనను కామెంట్ చేస్తూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు.