జనసేన పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో జనసేన వినూత్న నిరసన..

విజయవాడ: జనసేన పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం లో జనసేన వినూత్న నిరసన.బిసిల ఆత్మగౌరవ సభ కాదు.

 Janasena Party Leaders Pothina Venkata Mahesh Strange Protest In Vijayawada Deta-TeluguStop.com

ఆత్మ వంచన సభ.బిసిలను మోసం చేస్తున్న జగన్ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులతో నినాదాలు.పోతిన వెంకట మహేష్ జనసేన నేత.జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో పెట్టిన సభ బిసిల ఆత్మ వంచన సభ.బిసి మంత్రులు కు సన్మానం‌ చేయడం వింతగా ఉంది.కృష్ణయ్య పదవి కోసం బిసి ల జాతులను తాకట్టు పెట్టారు.కేసిఆర్, జగన్మోహన్ రెడ్డి లు బిసిలకు అన్యాయం చేసినా మీకు కనిపించ లేదా.మీ పదవి కోసం బిసిల‌ హక్కులను తాలట్టు పెడతారా.కేసిఆర్ దత్త పుత్రుడు ‌జగన్మోహన్ రెడ్డి కోసం మా భవిష్యత్తు ను కాలరాస్తారా.

బిసి ప్రజలందరికీ కృష్ణయ్య సమాధానం చెప్పాలి.రిజర్వేషన్ కుదించడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లు పోటీ చేసే అర్హత కోల్పోయారు.

మీరు బీసిల కు నేతగా ఉన్నారా.‌ జగన్మోహన్ రెడ్డి కి దళారిగా మారారా.

బిసిలకు జరుగుతున్న అన్యాయం పై జగన్మోహన్ రెడ్డి ని ఎందుకు నిలదీయడం లేదు.రాజ్యసభ సీటు కోసం బిసిల ద్రోహి జగన్ కు మద్దతు ఇస్తారా.

మీ చర్యల వల్ల బిసి సంక్షేమ సంఘం సిద్దాంతం పక్కదారి పట్టించి.బిసిల నాయకుడిగా ఉన్న కృష్ణయ్య.బిసిల ప్రయోజనాల ను కాలరాశారు.జగన్మోహన్ రెడ్డి బిసిలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుతున్నారు.

కృష్ణయ్య చేసే కుటిల యత్నాలు ను బిసిలంతా తిప్పి కొట్టాలి.జగన్మోహన్ రెడ్డి బిసిలకు ఏమి న్యాయం చేశారో చెప్పాలి.

సామాజిక న్యాయం చేయకపోగా…‌సామాజిక మోసం చేశారు.జగన్ ప్రభుత్వం లో బిసి సబ్ ప్లాన్ ను తప్పుదోవ పట్టించారు.

బిసిల కోసం కేటాయించిన నిధులు నవరత్నాలకు మళ్లించారు.ఇన్ని చేసినా… జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదో కృష్ణయ్య చెప్పాలి.నామినేటెడ్ పోస్ట్ లు, టిడిపి పాలకవర్గం, సలహాదారులు, వీసిల నియామకంలో బిసిలకు అన్యాయం చేయలేదా.14బిసిల కార్పొరేషన్ లను 56 బిసి కార్పొరేషన్ లు‌చేశారు.ఈ కార్పొరేషన్ లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

కేవలం ప్రచారం కోసమే జగన్ బిసిల‌ను వాడుకున్నారు.139బిసి కులాలను జగన్ మోసం చేస్తే.మీరెందుకు ప్రశ్నించడం లేదు.

కుల‌చేతి వేత్తుల వారికి పనిముట్లు ఇవ్వకుండా మోసగించ లేదా.బిసిల ముసుగు వేసుకుని జగన్మోహన్ రెడ్డి కి గులాం‌ గిరీ చేస్తున్నారా.

వీటన్నింటికీ సమాధానం చెప్పాక.వైసిపి మంత్రులు కు సన్మానం‌ చేయండి.

బిసి నాయకుడిగా ఎదిగిన కృష్ణయ్య.బిసి ల కు జరిగే అన్యాయం పై మాట్లాడరా.మీరు పదవుల కోసం… బిసిల ద్రోహి గా మారిపోయారా.జగన్మోహన్ రెడ్డి బిసిలకు చేసిన మోసాలు పై ముందు సమాధానం చెప్పాలి.బిసి అంటే బ్యాక్ బోన్ అంటూ జగన్ ప్రచారం బాగా చేసుకున్నారు.నేటికీ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ గానే జగన్ చూస్తూ… మోసం చేస్తూ ఉన్నారు.

ఆర్.కృష్ణయ్య ముందు బిసి లకు క్షమాపణ చెప్పాలి.

మాలాంటి‌ బిసిలను చట్ట సభల్లో స్థానం కల్పించాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు.34శాతం రిజర్వేషన్ బిసిలకు అమలు చేయాలని మా అధినేత న్యాయ పోరాటం చేశారు.బిసిలంతా‌ వాస్తవాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వండి.కృష్ణయ్య నిజంగా బిసిల దళపతి అయితే .కేసిఆర్, జగన్మోహన్ రెడ్డి లను నిలదీయాలి.మీ తెల్లని కాగితం పై నల్లని చుక్కలు అంటించవద్దు.

విజయవాడ లో త్వరలో బిసి గర్జన పెట్టి.పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తాం.

ఆర్.కృష్ణయ్య కి చిత్తశు ఉంటే బిసిలకు చేసిన అన్యాయం పై జగన్ ను నిలదీయాలి.జగన్మోహన్ రెడ్డి.బిసిలకు ఏమేమి మేలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి.బిసిలంతా ఏకమై… జగన్ కి‌ బుద్ధి చెప్పడానికి ముందుకు రావాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube