పిఠాపురంలో ఇల్లు అద్దెకు తీసుకున్న పవర్ స్టార్.. అద్దె ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.అటు రాజకీయాలు ఇటు సినిమాలు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

 Janasena Party Chief Pawan Kalyan New House In Pithapuram Details, Pithapuram, J-TeluguStop.com

ఇకపోతే జనసేన పార్టీ( Janasena Party ) అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదే విషయం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనాని ఇటీవల ప్రకటించారు.

Telugu Chebrolu, Janasena, Pawankalayan, Pawan Kalyan, Pithapuram, Tollywood-Mov

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని ఎంపిక చేశారు చేబ్రోలులో కొత్త ఇంటిని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుని ఈ సారి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు.

గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంటపొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు( Farmer Oduri Nageswara Rao ) మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు.

Telugu Chebrolu, Janasena, Pawankalayan, Pawan Kalyan, Pithapuram, Tollywood-Mov

ఈ భవనాన్ని పవన్‌ నివాసం ఉండడం కోసం ఎంపిక చేసుకున్నారు.జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునే వరకూ ఇక్కడే ఉంటారు.ఈ ఇంటికి శుక్రవారం గృహప్రవేశం కూడా పూర్తయింది.

ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు.గ్రౌండ్‌ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల పార్కింగ్‌కు, మొదటి ఫ్లోర్‌లో ఆఫీసు నిర్వహణకు, రెండు, మూడు అంతస్తులు కలిపి డూప్లెక్సు తరహాలో నిర్మించారు.

పవన్‌కు అనువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు దీనిని ఎంపిక చేశారు.ఓదూరి నాగేశ్వరరావు పవన్‌ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

తనకు అద్దె వద్దని, కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్పినట్టు సమాచారం.ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్‌ పిఠాపురం రానుండటంతో అప్పటికే ఈ ఇంటిని సిద్ధం చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించారు.

ఈ ఇంటికి సమీపంలోనే పంటపొలాల్లో హెలిప్యాడ్‌ ఏర్పాటు పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube