పవన్ కి దిమ్మ తిరిగే ప్రశ్నలు సంధించిన పవన్ అభిమాని..దిలీప్

జనసేన లో గ్రూపు తగాదాలు మరోమారు బయటపడ్డాయి.గతం నుంచీ జనసేనలో లుకలుకలు ఉన్నా సరే అవి పెద్దగా కనిపిచలేదు -ఈ తగాదాలు ఉన్నా సరే కొంతమంది చాలా సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటూ పవన్ పై అభిమానాన్నిచూపిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు పవన్ కి ఎంతో క్లోజ్ గా ఉండే కోటరీ చేస్తున్న స్వార్ధ పనుల వలన పవన్ కళ్యాణ్ ఎంతో మంది విలువైన వారిని పోగొట్టుకుంటున్నాడు అనే టాక్ మొదట్లోనే వినిపిస్తూ ఉండేది కానీ అది ఎంతవరకూ నిజమా అనే సందేహంలో ఉండేవాళ్ళు కానీ ఈరోజు సుంకర దిలీప్ ఒక్క సారిగా జనసేనపై తిరుగుబావుటా ఎగురవేశాడు.

 Janasena Party Active Member Fire On Pavan Kalyan-TeluguStop.com

జనసేన పార్టీలో ముందు నుంచీయాక్టివ్ మెంబెర్ గా ఉన్న దిలీప్ పార్టీ ఎన్నో సార్లు మీడియా ముందు గానీ జనసేన తరుపున వచ్చే డిబేట్స్ లో కానీ తన వాయిస్ గట్టిగానే వినిపిచే వాడు.అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకుడు కూడా ఇదిలాఉంటే ఇప్పుడు దిలీప్ జనసేన నుంచీ బయటకి వస్తున్నాను అంటూ పెట్టిన పోస్ట్ జనసేనలో ఉన్న లుకలుకలు చెప్పకనే చెప్తోంది.

ఇంతకీ దిలీప్ ఏమన్నాడు.జనసేనపై తనకున్న అభిప్రాయం ఏమిటి.? అంటే.
కల్యాణ్ దిలీప్ ఫేస్ బుక్ పోస్ట్ ప్రకారం
“మీకంత భారం అనిపిస్తే నేను ఎవ్వరికి బరువు కాదలుచుకోలేదు.

పదే పదే ఆత్మాభిమానాన్ని దెబ్బె కొట్టే వ్యాఖ్యలు చేస్తూ.నాకు పార్టీకి సంబంధం లేదనే వ్యాఖ్యలు వినీ వినీ నా చెవ్వులు హోరెత్తిపోయాయి.మీకు అంత సరదా ఉంది కనుక.ఒక్కడినే వచ్చా.

ఒక్కడిగానే పోరాడా.ఒక్కడిగానే వెళ్లిపోతున్నా.

క్రింద ఉన్న ఎదవల బజారు వ్యాఖ్యలను ఏ రోజు శ్రీ.పవన్ కళ్యాణ్ గారు ఖండిచక పోగా వాళ్ళని కీలక పదవుల్లో కొనసాగించడం ఆయన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు కనుక.

ఇక నేను జనసేన అభిమానిగా కూడా కొనసాగదలుచుకోలా.

పార్టీ ఆఫీస్ వ్యక్తుల చెంచాలు శృతి మించి వ్యాఖ్యానాలు చేస్తే నేను రోడ్ ఎక్కుతా.

ఆల్రెడీ విసిగి విసిగి ఉన్నా కనుక ఎవరి పనులు వారు చేసుకుంటూ అందరికి మంచిది.ఇక జనసేన ఊసు నాకు అనవాసరం.అలాగే నా ఊసు కూడా ఏ దూల గాడు తియ్యకుండా ఉంటే మంచిది.నాలుగేళ్లు ఓ పీడకల అనుకుని మర్చిపోతా.ఉంటా ” అని కల్యాణ్ దిలీప్ తీవ్ర ఆవేదనతో తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు… ఆతరువాత మరొక పోస్ట్ కూడా దిలీప్ పెట్టారు.
“నాకు పార్టీకి సంబంధం లేదని మీడియా చానెల్స్‌కి ఫోన్ చేసి చెప్పే మీడియా హెడ్.పి.ఆర్.ఓ వేణు.ఇదే ముక్క 48 గంటల్లో ప్రెస్ నోట్ ఇప్పిస్తే.

ఈ జన్మలో జనసేన మొహం కూడా చూడను.ప్రెస్ నోట్ ఇప్పించి నన్ను ఈ మానసిక వ్యధ నుండి విముక్తుడిని చేస్తే మీకు రుణపడి ఉంటా.నా బ్రతుకు నేను బ్రతుకుతా.” అని కల్యాణ్ దిలీప్ తెలిపారు.అయితే ఇవన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తెలియకుండానే జరుగుతాయా పార్టీలో సుంకర దిలీప్ ని తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏకపక్షంగా ఉండవు మరి సుంకర దిలీప్ విషయంలో పవన్ నిర్ణయం ఉన్నట్లేగా.నాలుగేళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీలో ఇచ్చే సముచిత స్థానం ఇదేనా…స్టేజి మీద ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ అన్యాయం,అక్రమం అని అరిచే పవన్ కళ్యాణ్ కి దిలీప్ విషయంలో అన్యాయం అక్రమం అని అనిపించడం లేదా.? అంటూ నిటిజన్లు పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియా సాక్షిగా దుమ్ము దులిపెస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube