ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి.ఎన్నికలకు సిద్దమవుతున్న పార్టీలు ప్రత్యర్ధి పార్టీలను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు.తాజాగా వైసీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు జనసేన నేతల నుంచి నిరసన సెగ తగిలింది.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తుండగా ఆయన్ను అడ్డుకోవాలని జనసేన వీరమహిళలు భావించారు.ఈ మేరకు పి గన్నవరం మండలం జి పెదపూడి వద్దకు భారీగా చేరుకున్నారు.
గోదావరి వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయాలు సరిపోవటం లేదని.పది వేల రూపాయాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సీఎం జగన్‌ను కలిసేందుకు జనసేన వీర మహిళలు ప్రయత్నించారు.
కానీ పోలీసుల నిబంధనలతో సాధ్యపడలేదు.అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వాహనాన్ని జనసేన వీర మహిళలు అడ్డుకున్నారు.
ఆయన వాహనానికి అడ్డంగా రోడ్డుపై ఆందోళన నిర్వహించారు.సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జనసేన మహిళా నేతలపై అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా తన వాహనాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం చెందారు.
తాము సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు.దీంతో జక్కంపూడిని జనసేన వీరమహిళలు ఏకవచనంతో సంబోధించినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో జనసేన పార్టీ కార్యకర్తలే అతి చేశారని.జక్కంపూడి రాజా ముందు వారితో నవ్వుతూనే మాట్లాడటానికి ప్రయత్నించారని వైసీపీ నేతలు వివరిస్తున్నారు.

ఎమ్మెల్యే వెళ్లిపోతాడేమోనని జనసేన మహిళ అంటే.వీడు ఎక్కడికీ పోడు.వీడెందుకు వెళ్తాడు అంటూ పలువురు జనసేన నేతలు నోరుపారేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.దీంతో రాజా సీరియస్ అయ్యారని.ఇందులో ఆయన చేసిన తప్పేమీ లేదంటున్నారు.అయితే ముందుగా ఎంపిక చేసిన వారితోనే ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారని.
వేరే వాళ్ల నుంచి కనీసం వినతి పత్రాలు కూడా తీసుకోలేని స్థితిలో సీఎం ఉన్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.