అల్లు అర్జున్ పవన్ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకో.. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు!

పుష్ప 2( Pushpa 2 ) సినిమా మరి కొన్ని గంటలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాకు సెగ తగులుతుందని చెప్పాలి.

అల్లు అర్జున్( Allu Arjun ) ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) మద్దతు తెలియజేయకుండా వైకాపా నాయకుడు తన స్నేహితుడి కోసం నంద్యాలకు వెళ్లడంతో అల్లు అర్జున్ ను రాజకీయ నాయకులు కూడా టార్గెట్ చేశారని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఏపీలో కొన్ని ప్రాంతాలలో పుష్ప సినిమాకు కాస్త వ్యతిరేకత కూడా ఉంది.అయితే ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు పుష్ప సినిమాని అడ్డుకుంటాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే పుష్ప సినిమాలో చూపించినంత అబద్ధమని ఈ సినిమా చూసి గతంలో యువత కొన్ని లక్షల చెట్లను నరికి వేశారు.ఇప్పుడు పార్ట్ 2 విడుదలవుతుంది.ఇంకెన్ని లక్షల చెట్లు నరికేస్తారో అందుకే ఈ సినిమాని విడుదల చేయకూడదు అంటూ డిమాండ్ చేయడంతో ఈయన వ్యాఖ్యలపై అభిమానులు ఫైర్ అయ్యారు అయితే తాజాగా గన్నవరం నియోజకవర్గ జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు( Chalamalasetty Ramesh Babu ) తమ నియోజకవర్గంలో పుష్ప సినిమాని అడ్డుకుంటాము అంటూ కామెంట్లు చేశారు.

ఈ సందర్భంగా ఈయన పుష్ప2 సినిమా గురించి మాట్లాడుతూ.బన్నీ వ్యవహార శైలి జనసైనికులను మెగా అభిమానులు చాలా బాధపెట్టింది.మొన్న ఏపీలో జరిగిన ఎన్నికలలో ఈయన మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా పనిచేశారు.

Advertisement

అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని బన్నీ పనిచేశారు.ఇప్పటికైనా మించిపోయినది లేదు వెంటనే నువ్వు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్ళను కడిగి ఆ నీటిని నీ నెత్తిపై చల్లుకో లేకపోతే పుష్ప 2 సినిమాని అడ్డుకుంటాము అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను హెచ్చరిస్తూ ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆమెను దూరం పెట్టాలని కోరుకుంటున్న మెగా ఫ్యాన్స్.. అభిమానులకు ఇది భారీ షాక్!
Advertisement

తాజా వార్తలు