జనసేన కు  కోవర్ట్ ల భయం .. ?

ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడుతున్నట్టుగా కనిపిస్తోంది జనసేన పార్టీ( Janasena party ).టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని , వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.

 Janasena Is Afraid Of Coverts, Jagan, Tdp, Telugudesham, Janasena, Pavan Kalyan,-TeluguStop.com

సీట్ల పంపకాలు పూర్తయిన తర్వాత,  అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు పవన్ నిర్ణయించుకున్నారు.అలాగే భారీ బహిరంగ సభలు,  రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసే విధంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.

దీంతో పాటు , ఇటీవల కాలంలో జనసేనలోకి ఇతర పార్టీల నుంచి కీలక నేతలు వచ్చి చేరుతుండడంతో,  ఆ పార్టీలో హడావుడి నెలకొంది .ఎన్నికల సమయం దగ్గర పడడం , ఇప్పటికే 58 అసెంబ్లీ , 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను జగన్ ప్రకటించడంతో,  ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.దీంతో కొంతమంది జనసేన వైపు .

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Machlipatnam Mp, Pavan Kalyan, Telugudes

 మరికొంతమంది టీడీపీలోను చేరుతున్నారు.ఇటీవల కాలంలో జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి.అయితే వైసీపీలోని( YCP ) కీలక నాయకులుగా ఉండి ,  జగన్ కు అత్యంత సన్నిహితులు గానూ ముద్ర పడినవారు కొంతమంది పార్టీకి రాజీనామా చేశారు.

వారంతా జనసేన లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.ఇది ఇలా ఉంటే వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలంతా నిజంగా జనసేన లోకి మనస్ఫూర్తిగా వచ్చి చేరుతున్నారా లేక వైసిపి కోసం జనసేన లో చేరి కోవర్ట్  రాజకీయాలు చేసేందుకు వస్తున్నారా అనే అనుమానాలు పవన్ కళ్యాణ్ లోనూ నెలకొన్నాయట.

అందుకే ఇటీవల కాలంలో వైసిపి నుంచి జనసేనలోకి వచ్చి చేరిన నాయకుల విషయంలో పవన్ అప్రమత్తంగా  వ్యవహరిస్తున్నారు.ఇదిలా ఉంటే వైసీపీలో సీనియర్ గానూ , జగన్ ( jagan )కు అత్యంత సన్నిహితుడి గానూ ముద్రపడిన మచిలీపట్నం వైసిపి ఎంపి బాల సౌరి  జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లుగా ప్రకటించేసుకోవడం , వచ్చే ఎన్నికల్లో తాను మచిలీపట్నం నుంచి పోటీ చేస్తానని చెప్పడమే కాకుండా , పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) పవన్ ద్వారానే పూర్తవుతుందని బాలశౌరి ప్రకటించి, తాను జనసేన లో చేరుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Machlipatnam Mp, Pavan Kalyan, Telugudes

ఆ తర్వాత మూడు రోజులకు పవన్ కళ్యాణ్ ను కలిశారు.అయితే పవన్ బాలశౌరి ని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారో లేదో తెలియదు గాని, బాలశౌరి కూడా ఈ విషయాన్ని తర్వాత చెబుతాను అంటూ దాటవేశారు.బాలశౌరి చేరిక విషయంలో జనసేన సైతం క్లారిటీ ఇవ్వలేదు కానీ , ఆయన టికెట్ మాత్రం ప్రకటించేసుకున్నారు.అయితే వైసిపి కోవర్టుగా నే బాల శౌరి ని జనసేన చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

  కేవలం బాల శౌరి మాత్రమే కాకుండా,  వైసిపిలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన వారు జనసేన వైపు వచ్చేందుకు సిద్ధమవుతుండడంతో,  వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని , కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించేందుకు జనసేనలో వీరంతా చేరుతున్నారు అనే అనుమానం కూడా పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన వర్గాల్లోనూ నెలకొన్నాయి.అందుకే చేరికల విషయంలో పవన్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube