జనసేన కు పెరుగుతున్న మేధావుల మద్దత్తు ...

గత ఎన్నికల్లో పూర్తిస్థాయిలో విఫలమైన జనసేన పార్టీని( Janasena ) పార్టీ కొంత కాలం క్రితం వరకూ ఎవరికి పెద్దగా అంచనాలు లేవు.అభిమానుల హడవుడే తప్ప సామాన్య ప్రజలు , తటస్థ వోటర్లు ఆ పార్టీ ని ఓన్ చేసుకోలేదని .

 Janasena Image Growing Rapidely In Intelectuals Details, Janasena Party, Undaval-TeluguStop.com

ఆ పార్టీ నిలదొక్కుకోవడం కష్టమంటూ బావించేవవరు .అయితే ఆ స్థాయిలో విఫలమైనా కూడా బలం గా నిలబడి ప్రజా సమస్యలపై నిలబడి పోరాటం చేస్తున్న జనసేనకు క్రమం గా ఆదరణ పెరుగుతుంది .మౌలిక అవసరాలతో పాటు ,అవినీతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు తటస్థుల అభిమానం కూడా చూరగొనతుంది .ఇప్పుడు మేధావులు కూడా జనసేన కు మంచి భవిష్యత్తు ఉందని వాఖ్యనిస్తున్నారు.

జనసేన పార్టీ ని ఇంకా అదే దృష్టితో చూస్తే మాత్రం ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుందని హెచ్చరిస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ .( Undavalli Arun Kumar ) మేధావి వర్గానికి చెందిన ఉండవల్లి రాజకీయాలను సున్నితంగా పరిశీలిస్తారని.ఆయన అంచనాలు తప్పవని కూడా అంటుంటారు.ఉండవల్లి అభిప్రాయం ప్రకారం గత ఎన్నికలలో ఆరు శాతంగా ఉన్న జనసేన ఓట్ బ్యాంక్ ఇప్పటికే 12 శాతానికి చేరుకుందని ఈ శాతం ఎన్నికలు దగ్గరికి వచ్చే కొలది 15 నుంచి 20 వరకు కూడా చేరడానికి అవకాశముందని ప్రభుత్వ ఏర్పాటు లో జనసేన కీలకంగా మారుతుందంటూ ఆయన వాఖ్యనించారు …

Telugu Ap, Cmjagan, Janaseantdp, Janasena, Janasenapawan, Pawan Kalyan, Undavall

ఒకప్పుడు పార్ట్ టైం పొలిటిషన్ లా ఉన్న పవన్ కళ్యాణ్ లో( Pawan Kalyan ) చాలా మార్పులు వచ్చాయని , పవన్ నిజాయితీగల రాజకీయాలు చేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.ఒకవేళ కేంద్రం కనుక జగన్ కి మద్దతిస్తుందని వార్తలు గనక నిజమే అయితే తెలుగుదేశం, జనసేన పొత్తు కుదరకుండా కేంద్రం అడ్డు పడే అవకాశాలు ఉంటాయని … ఒకవేళ జగన్తో మాకు సంబంధం లేదని కనుక భావిస్తే అప్పుడు బాజాపా కూడా ఈ పొత్తు లో కలిసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

Telugu Ap, Cmjagan, Janaseantdp, Janasena, Janasenapawan, Pawan Kalyan, Undavall

ఉభయగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి బారి ఓట్ బ్యాంక్ ఉందని ,ఇదే వూపు మిగతా జిల్లాలలో కూడా తెచ్చుకుంటే ఆ పార్టీ కి తిరుగు లేదని ఆయన చెప్పుకొచ్చారు .ఏది ఏమైనా కచ్చితమైన రాజకీయ అంచనాలు వేస్తారని పేరున్న ఉండవల్లి లాంటి మేధావి నోటి నుండి వచ్చిన ఈ వాఖ్యల తో జనసైనికులు సంతోశంగా ఉన్నారు .ఇక తమ పార్టీ కి తిరుగు లేదని ధీమా ప్రదర్శిస్తున్నారు .మరి ఉండవల్లి జోస్యం ఏ మేరకు నిజమవుతుందో వేచి చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube