క్రితంసారి కంటే రానున్న ఎన్నికలను ఎంతో సీరియస్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.ఇక వైసిపిని ఎదుర్కొనేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కూడా ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వమని చెప్పిన జనసేనాని… ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్ అధికారంలోకి రాకూడదని కృత నిశ్చయంతో ఉన్నారు.
ఇదే నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఖాయమని అందరూ భావిస్తున్నారు.
కానీ వైసీపీ నాయకులు మాత్రం ఎంతో తెలివిగా పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఒక్కడే వచ్చి 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని సవాలు చెబుతున్నారు.కానీ ప్రస్తుతం జనసేన ఉన్న పరిస్థితుల్లో అన్నీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం కష్టం.
కానీ జనసేన, టిడిపి కలిస్తే వచ్చే ఫలితం తెలుసు కాబట్టి వైసిపి వారు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని టిడిపి నేతలు అంటున్నారు.

ఇక పొత్తు సమయంలో జనసేన బలంగా నియోజకవర్గంలో ఆ సీట్లను వారికి పార్టీకి త్యాగం చేయాలనే ఉద్దేశంతో టిడిపి ప్రభుత్వం ఉందట.అలాగే జనసేన వారు కూడా కొన్ని అసెంబ్లీ స్థానాలను పట్టుబట్టి మరీ అడుగుతున్నారని భోగట్టా.ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మొత్తం ఉన్న 17 అసెంబ్లీ స్థానాలలో తెనాలి, గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి స్థానాలు జనసేనకు పొత్తులో కేటాయించి అవకాశం ఉందట.

తెనాలిలో జనసేన నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని, సత్తెనపల్లిలో జనసేన తరుపున ఒక మాజీ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కనుంది అని సమాచారం.గతంలో రెండు సార్లు కాంగ్రెస్ నుండి అక్కడ విజయం సాధించిన యర్రం వేంకటేశ్వరరెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఫిక్స్ అయిపొయిందట.ఇక గుంటూరు వెస్ట్ టికెట్ కన్నాలక్ష్మీనారాయణకు లభించనుందట.
ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉండగా త్వరలోనే ఆయన జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం.







