పెద్దాయన పాలిటిక్స్ తో పవన్ ఇబ్బందులు ?

జనసేన పార్టీ గతంతో పోలిస్తే ఏపీలో బాగానే బలం పెంచుకుంది.మిత్రపక్షమైన బీజేపీ కంటే జనసేన బెటర్ అనే విధంగా రాజకీయంగా పైచేయి సాధించింది.

మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో జనసేన ప్రభావం బీజేపీ కంటే ఎంత ఎక్కువగా ఉంది అనేది అందరికీ అర్థమైంది.అదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.బిజెపి సహకారం తో తిరుపతి ఉప ఎన్నికలలో గట్టెక్కాలని, ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి సహకారంతో ఎన్నికలలో పోటీ చేసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఎంతగానో తాపత్రయపడుతున్నారు.

అయితే బిజెపి కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్న తీరు తో పవన్ తో పాటు ఆయన పార్టీ నాయకులు నీరుగారిపోతున్నారు.ఏపీ బిజెపి నాయకులు ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నా, సర్దుకుపోతూ వస్తున్న పవన్ కు బీజేపీ పెద్దలు మోదీ అమిత్ షా వంటి వారు తనను దూరం పెడుతున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుతో పవన్ తీవ్ర ఆగ్రహానికి, అవమానాలకు గురవుతున్నారు.

Advertisement

అసలు బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోకముందు పరిస్థితి వేరేగా ఉండేది.పవన్ కు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చేవారు.

స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చోపెట్టుకునే వారు.పవన్ తమకు ఆప్త మిత్రుడు అన్నట్లుగా మోదీ వ్యవహరించేవారు.

ఇక బిజెపికి పవన్ మద్దతుగా నిలబడుతూ వుండేవారు.కానీ పొత్తు పెట్టుకున్న మొదటి రోజు నుంచి ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు పవన్ రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ వచ్చినా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు.

మొహం చాటేసినట్టుగా పవన్ తో వ్యవహరిస్తున్నారు.ఏపీలో జనసేన సహకారం లేకుండా బీజేపీ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

అయినా పవన్ కు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు.

Advertisement

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు సైతం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ సులభంగానే దక్కుతున్నా, పవన్ కు మాత్రం అపాయింట్మెంట్ దక్కకపోవడంతో, రాజుగారు కంటే పవన్ ఎందులో తీసిపోతారు అంటూ జనసైనికులు మండిపోతున్నారు.బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ పెద్ద తప్పు చేశారని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే బీజేపీకి మద్దతు ఇచ్చి ఉంటే , పవన్ ప్రాధాన్యం మరింతగా పెరిగేదనే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా దక్కకపోవడం, తనను పక్కనపెట్టినట్టు వ్యవహరిస్తున్న తీరుతో పవన్ ఆగ్రహంగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన రాజకీయంగా బలపడాలి, అధికారంలోకి రావాలి అంటే బీజేపీ మద్దతు తప్పనిసరి కావడంతో, అన్ని సర్దుకుపోతూ పవన్ వస్తున్నారు.

కాకపోతే రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులు, అవమానాలను పవన్ భరించాల్సి వస్తోంది.

తాజా వార్తలు