ఏపీలో రాజకీయాలలో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది.ఇన్ని రోజులు ఎలాంటి చేరికలు లేకుండా సైలెంట్ గా తన ప్రచారంలో దూసుకుపోయిన జనసేన ఇప్పుడు ఒక్కసారిగా తన ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తుంది.
అధికార, ప్రతిపక్ష పార్టీలకి చెమటలు పట్టించే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలని సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే జేడీ లక్ష్మినారాయణ జనసేనలో చేరడం రాజకీయాలలో సంచలనంగా మారింది.
అదే సమయంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిలో ఏపీలో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించి ఆమెని కలవడం కూడా జరిగింది.
మరో వైపు ప్రతిపక్షాలతో పొత్తుపై జనసేనాని గట్టి కసరత్తు చేస్తున్నాడు.
వారికి సీట్ల కేటాయింపులో చర్చలు నిర్వహిస్తున్నాడు.ఇంతలో ఊహించని విధంగా బీఎస్పీకి జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనౌన్స్ చేసారు.
బీఎస్పీ పార్టీకి మొత్తం 21 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంట్ సీట్లని జనసేన ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.ఏపీలో ఎ మాత్రం ప్రభావం లేని బీఎస్పీ పార్టీకి అన్ని సీట్లు కేటాయించడం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం ఉందని ఇప్పుడు చర్చ నడుస్తుంది.







