తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారులను ఆ తర్వాత నిన్న 54 మంది కార్పొరేషన్ చైర్మన్ ల నియామకాలను రద్దు చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జనార్దన్ రెడ్డి రాజీనామా( Janardhan Reddy )ను ఆమోదించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పంపించడం జరిగింది.గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షలలో పేపర్ లీక్ ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది.
ఈ ఘటనతో పోటీ పరీక్షలు వాయిదా పడటం వంటివి నిరుద్యోగుల్లో( Unemployed ) తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి.పేపర్ లీక్ ఘటనకు సంబంధించి చాలా మందిని అరెస్టు కూడా చేయడం జరిగింది.
గత ప్రభుత్వానికి ఈ ఘటన చాలా చెడ్డ పేరు తీసుకురావడం జరిగింది.ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది.