నిన్న మొన్నటి వరకు మాటలకు , వాగ్దానాలకు మాత్రమే పరిమితమైన జనసేన- తెలుగుదేశం( Jana Sena TDP ) ల పొత్తు ఇప్పుడు క్రియాశీలక రూపం తీసుకుంది.ముఖ్యంగా రెండు పార్టీల తరఫున ఉమ్మడి కార్యాచరణ కోసం ఇరు పార్టీల అగ్ర నేతలూ రాజమహేంద్రవరం వేదికగా సమావేశం అవటం తో ఈ రెండు పార్టీల పొత్తుపై కీలక అడుగు పడినట్లే భావించాలి.
ముఖ్యంగా ఎన్నికల ప్రచార అస్త్రాలను నిర్ణయించుకోవడం మరియు ఉమ్మడి ప్రయాణానికి అవసరమైన వ్యూహాత్మక సర్దుబాట్లను చర్చించడానికే ఇరు పార్టీలు సమావేశమైనట్లుగా తెలుస్తుంది.సమావేశం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ ( Nara Lokesh )మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ముఖ్యం గా ఈ రెండు పార్టీల పొత్తు వైసిపి అరాచక పాలన నుంచి ఆంధ్రా ప్రజలను విమోచన చేసేటందుకే అని మా ప్రధమ లక్ష్యం కూడా వైసిపి ని గద్దే దించడమే అని చెప్పుకొచ్చారు.అయితే ముఖ్యమంత్రి పదవిపై కానీ పవర్ షేరింగ్ పై కానీ ఈ ముఖ్య నేతలు పెదవి విప్పలేదు సరి కదా అదంత ముఖ్యమైన విషయం కాదన్నట్టు గా వ్యవహరించడం విశేషం .అయితే ఎన్నికల వరకూ ఉమ్మడి కార్యాచరణ, క్షేత్రస్థాయి పోరాటాలు ఉంటాయని ఈ ఇరు నాయకులు తేల్చి చెప్పేశారు.

అయితే ఇక ఇప్పుడే అసలు కథ మొదలవుతుందని తెలుస్తుంది , ముఖ్యమైన ఘట్టంలోకి ప్రవేశించినందున ఇప్పుడు పొత్తు తాలూకు నెగిటివే అండ్ పాజిటివ్ పలితాలను ఈ ఇరుపార్టీలు ఫేస్ చేయాల్సి వస్తుంది.ముఖ్యంగా సీట్లు త్యాగం చేయాల్సిన నాయకుల తాలూకు ప్రతిఘటనను ఈ రెండు పార్టీల అధ్యక్షులు ఎలా డీల్ చేస్తారన్నదాని పైనే పొత్తు విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.అంతేకాకుండా ప్రస్తుతం తెలుగుదేశం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు పవర్ షేరింగ్ ను ఆఫర్ చేయకపోతే జనసేన శ్రేణులు పూర్తిస్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు.
అలాగని జిల్లావ్యాప్తం గా ప్రభావం చూపగల తమ నేతలను ప్రక్కన పెట్టి కీలక నాయకులు కూడా లేని జనసేనకు అధికారంలోని వాటా గాని కీలక స్థాయిలో సీట్లు గాని ఇస్తే అది తెలుగుదేశానికి దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు తీసుకొచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది.

ఉమ్మడి ప్రయాణం అన్నది మాట్లాడుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాజిక సమీకరణాల రీత్యా ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రయాణం అనే చెప్పాలి.మరి ఇప్పుడు ఈ రెండు పార్టీలు అత్యంత కీలకమైన దశలోకి ప్రవేశించాయి.కర్ర విరగకుండా పాము చావకుండా ఉన్న రీతిలో తమ తమ సామాజిక వర్గాల ఓటర్లకు సంతృప్తి కలిగిస్తూనే తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే రీతిలో ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
మరి ప్రత్యేక పరిస్థితుల్లో జట్టు కట్టిన ఈ రెండు పార్టీలు ఈ టాస్క్ ను ఏ స్థాయిలో విజయవంతం చేస్తాయి అన్నదాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తు విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు