రెండు రాష్ట్రాలు- రెండు పార్టీలు: పొత్తులపై జనసేన మార్క్ చర్చలు !

ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు .పార్టీ అధ్యక్షుడు కూడా పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయారు, కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆ పార్టీకి స్పెషల్ డిమాండ్ ఏర్పడింది .

 Jana Sena Mark Alliances Between Two States And Two Parties! , Jana Sena, Two-TeluguStop.com

ప్రాంతీయ పార్టీ తో ఒక రాష్ట్రం లోనూ జాతీయ స్తాయిలో పార్టీ తో మరో రాష్ట్రం లోనూ ఇప్పుడు ఆ పార్టీ పొత్తు చర్చలను డీల్ చేస్తుంది.దారుణ పలితాల దగ్గర్నుంచి క్రియాశీలక పాత్ర వరకు జనసేన ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది .దీని వెనక ఓడిపోయినా మొక్కవోని పట్టుదలతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చూపిన చిత్తశుద్ధి ఒక కారణమైతే ఎటువంటి పదవులు, ప్రయోజనాలు ఆశించకుండా అకుంఠిత దీక్ష ,పట్టుదలతో పవన్ వెంట నడిచిన నిస్వార్ధ జనసైనికులు మరో కారణం.నిజానికి ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గం ఇప్పుడు పవన్ వెంట కనిపిస్తుంది కానీ ప్రజారాజ్యం అనుభవాలతో 2019 లో జనసేన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆ సామాజిక వర్గం పవన్కు మొఖం చాటేసిందని వచ్చిన ఫలితాలను బట్టి అర్థమవుతుంది అయితే పవన్ నిజాయితీ, పేదలకు మంచి చేయాలన్న ఆయన చిత్తశుద్ధి నచ్చి కులమతాలకు అతీతం గా ఆయనతో నడిచిన వేలాదిమంది జనసైనికుల కృషి ఫలితమే ఇప్పుడు జనసేనకు దక్కుతున్న గుర్తింపుని చెప్పుకోవాలి.

అయితే ఇప్పటికీ ఇంకా చాలా లక్ష్యాలను జనసేన చేరుకోవాల్సి ఉంది.

Telugu Andhra Pradesh, Jana Sena, Lokesh, Pawan Kalyan, Telangana-Telugu Politic

ప్రస్తుతానికి జాతీయస్థాయిలో బిజెపితో రాష్ట్రస్థాయిలో టిడిపితో పొత్తును గౌరవప్రదమైన రీతిలో ముందుకు తీసుకెళుతున్న జనసేన ప్రజాక్షేత్రంలో కూడా తన పట్టును నిరూపించుకున్నప్పుడే ఒక రాజకీయ పార్టీగా తాను అనుకున్న లక్ష్యాలను సాదిస్తుంది .వ్యూహాత్మకమైన ఎత్తుగడలతోపాటు ప్రజల అభిమానాన్ని నిలబెట్టుకోగలిగితేనే ఇన్ని సంవత్సరాల పార్టీ ప్రయాణానికి నిజమైన గుర్తింపని చెప్పాలి.

Telugu Andhra Pradesh, Jana Sena, Lokesh, Pawan Kalyan, Telangana-Telugu Politic

అత్యంత కీలకమైన దశలోకి చేరిన జనసేన ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎన్నిక ల లోనూ క్రియాశీలకు పాత్ర పోషించేందుకు సిద్ధమైంది.ఇప్పటివరకు గడిచినది ఒక లెక్క ఇక్కడి నుంచి మరో లెక్క అన్నట్లుగా ప్రత్యర్థుల ఎత్తుగడలను తట్టుకుంటూనే ప్రజాభిమానాన్ని గెలుచుకుంటూ జనసేన( Jana Sena ) ని పార్టీని ఎలా ముందుకు నడపాలి అన్నదే జనసేన ప్రదాన టాస్క్ .ఏది ఏమైనా నిస్వార్ధంగా కృషి చేస్తే ఫలితాలు కచ్చితంగా ఉంటాయి అనడానికి జనసేన రాజకీయ ప్రయాణాన్ని మాత్రం ఉదాహరణగా చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube