సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా జైలర్..
( Jailer movie ) చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇంతకు ముందు రజనీకాంత్ సినిమాకు రిలీజ్ ముందు ఎలాంటి హైప్ ఉండేదో ఈ జైలర్ సినిమాకు కూడా అలాంటి హైప్ క్రియేట్ అయ్యింది.
దీంతో ఈ సినిమా విషయంలో ఈయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈయన ప్రస్తుతం ఏడు పదుల వయసు దాటిన కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్న రజినీకాంత్( Rajinikanth ) కు జైలర్ సినిమా హిట్ ఇస్తుంది అనే అనిపిస్తుంది.ఎన్నో ఏళ్ల ముందు సూపర్ స్టార్ ను చుసిన విధంగానే ఈ సినిమాలో రజినీకాంత్ కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది.
నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dilipkumar )దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.
కావాలా అనే ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు తమన్నా లాంచ్ చేయనున్నట్టు తెలిపారు.ఇప్పటికే ఈ సాంగ్ తమిళ్ వర్షన్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు తెలుగు వర్షన్ రేపు రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.
సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక రోల్స్ లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy