రజనీకాంత్( Rajinikanth ) నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో పాటు ఏకంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కోడలి పాత్రలో నటించిన నటి తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద జైలర్( Jailer ) ప్రభంజనం కొనసాగుతుండగా ఈ సినిమా థియేటర్లలో మాత్రమే చూడాల్సిన సినిమా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రజనీ కోడలి( Rajinikanth Daughter in law ) పాత్రలో నటించిన ఈ నటి పేరు అదితి కాగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ నటి తన పేరును మిర్నా మేనన్ గా మార్చుకున్నారు.కేరళ రాష్ట్రంలోని ఇడుక్కికి చెందిన మిర్నా మేనన్( Mirnaa Menoon ) నటించింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో పేరు, పాపులారిటీ సంపాదించుకున్నారు.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన మిర్నా మేనన్ ఫోటోలను చూసిన ఒక దర్శకుడు ఆమెకు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు.
2016 సంవత్సరంలో పట్టదారి సినిమా( Pattathari Movie )లో నటించిన ఈ నటి 2010 సంవత్సరంలో కలవని మప్పిలై అనే మరో సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించారు.బిగ్ బ్రదర్ సినిమా( Big Brother )తో గుర్తింపును సొంతం చేసుకున్న ఈ నటి తెలుగులో క్రేజీ ఫెలో, ఉగ్రం సినిమాలలో హీరోయిన్ గా నటించారు.
జైలర్ సినిమాలో రజనీ కోడలి పాత్రతో ఈ నటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

జైలర్ సినిమాలో మిర్నా మేనన్ పద్ధతిగా కనిపించినా రియల్ లైఫ్ లో మాత్రం అందాల ప్రదర్శనకు సిధ్దమేనని గ్లామర్ ఫోటోలను( Glamor Photos ) షేర్ చేస్తూ చెప్పకనే చెబుతున్నారు.మిర్నా మేనన్ కెరీర్ పరంగా బిజీ కావాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రముఖ నటి మిర్నా మేనన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.