విజయవాడ: జైభీమ్ భరత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.మాధవ్ లాగానే ఇంకో ఘనత వహించిన మంత్రి బాగోతం కూడా త్వరలో బయట పెడతా.
బాధితులు ఇప్పటికే నా తో మాట్లాడారు.పూర్తి ఆధారాలతో వారిని మీడియా ముందుకు త్వరలో తీసుకువస్తాం.వైసీపీ ఏది చేసినా జాతీయ రికార్డ్ గా నే మిగిలిపోతుంది.151 సీట్ ల లో రానున్న ఎన్నికల్లో 70 శాతం కొల్పోనుంది.ఓట్ లు వేసిన ప్రజలను వేటాడి, వెంటాడి చంపడం.వారిపై అన్ని రకాలుగా దాడులు చేయడం చూస్తున్నాం.రోజా చెప్పిన సూక్తి మీకు వినిపించాలి.మంత్రులు రోజా, విడదల రజని గతం లో అసెంబ్లీ లో మాట్లాడిన మాటలను మీడియా సమావేశం లో చూపించిన శ్రవణ్ కుమార్.
ఉండవల్లి శ్రీదేవి ఎంత బాగా పొగిడిన ఆమెకి మంత్రి ఇవ్వలేదు.మరో మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ లు చేస్తారు… దళితులు గిరిజనులు కోసం ఆమె పోరాటం చేయరు.
పదవులు పొందిన ఈ మంత్రులను అడుగుతున్న.డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఓ మిత్రుని వద్ద తమను చూసి ఓట్ లు వెయ్యలేదు అన్నారు.జగన్ ను చూసే వేశారు అన్నారు.ఎంపి మాధవ్ వీడియో ట్విట్టర్ లో రికార్డ్ లు సృష్టిస్తోంది.
చేసిన పనిపై సిగ్గుపడకుండా ఒక మీడియా ను తిడతారా.సినీ నటుడు పృధ్వీకి ఎస్ వి బి సి చైర్మన్ గా ఇచ్చారు.
ఆ పిచ్చి బత్తాయి ది ఒక ఆడియో బయటకు వచ్చింది.అంబటి రాంబాబు విజయాన్ని బాధితురాలు బయట పెట్టింది.
ఎందుకు మహిళ కమిషన్ వీరిపై స్పందించారు.ఆడవాళ్ళతో ఎవ్వరైన అసభ్యంగా మాట్లాడితే వారికి ప్రమోషన్ ఇస్తారా.
పృథ్వి ఇప్పుడు జనసేన లో జాయిన్ అవుతారు అట అలాంటి వాళ్లకు ఆ పార్టీనే కరెక్ట్ అని జై భీం భరత్ పార్టీ భావిస్తోంది.
పృధ్వి, అంబటి, అవంతీ లపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు గోరంట్ల మాధవ్ కు జగన్ మోహన్ రెడ్డి అలుసైపోయారు.
ఇకపై బుల్లెట్ కన్న వేగంగా జగనన్న వస్తాడు అని ఇంకోసారి అనడం మంత్రులు రోజా, రజని లు మానుకోవాలి.ఇలాంటి సంఘటన జరిగాక కనీసం అంతర్గతం గా అయిన ఎంక్వైరీ వెయ్యలేదు.
మాధవ్ ను పై ఎందుకు విజయసాయి ట్వీట్ చేయలేదు.ఎంపి రఘు రామకృష్ణమ్ రాజును అయితే దేశ ద్రోహం కేస్ పెట్ట లోపల వేసారు.
మాధవ్ ను వదిలేశారు తెలుకుట్టిన దొంగల్లా వుండిపోయారు.మాధవ్ విషయంలో స్పందించాల్సినది విజయసాయి.
సజ్జల స్పందించారు.ప్రభుత్వాన్ని ప్రతిసారీ ప్రశ్నిస్తోంది జై భీం భరత్ పార్టీ మాత్రమే.







