తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైనే ఆ పార్టీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది.రేవంత్ సరధ్వంయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, టిఆర్ఎస్ బిజెపి లకు ధీటుగా కాంగ్రెస్ ను అధికారం వైపుకు తీసుకు వెళ్ళగలరని బలంగా నమ్ముతోంది.
టిడిపి నుంచి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరిన కొద్దికాలంలోనే ఆయనకు పార్టీలో కీలక పదవులు అప్పగించింది.ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అయితే ఆయన పార్టీలో చేరిన కొద్ది కాలానికే తాము వద్దని చెబుతున్నా, ఆయనకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించడంపై సీనియర్ నేతలు మొదటి నుంచి ఆగ్రహం గానే ఉన్నారు.సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి పై బహిరంగంగా విమర్శలు చేస్తూ, ఆయన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్ నేతల విమర్శలను పట్టించుకోనట్టుగానే రేవంత్ వ్యవహరిస్తున్నా.అప్పుడప్పుడు మాత్రం వారి పైన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ విషయంలో సానుకూలంగా ఉంటూ.ఆయనను ప్రోత్సహిస్తూ వస్తుండడం తో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు.ప్రస్తుతం కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం రేవంత్ టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు .అలాగే భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ పైన విమర్శలు చేస్తున్నారు.రేవంత్ చంద్రబాబు మనిషి అని, ఆయన వెనుక సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారంటూ పది రోజులు క్రితమే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు.ఇక సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో పాటు వి.
హనుమంతరావు ఇలా చెప్పుకుంటే వెళితే చాలామంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

మొన్నటి వరకు టిఆర్ఎస్ కాంగ్రెస్ మద్య ప్రధాన పోటీ అన్నట్లుగా ఉన్నా… తెలంగాణాలో బీజేపీ బాగా బలం పెంచుకుంది.దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలతో పాటు, మునుగోడు లో ఉప ఎన్నికలు వస్తే అక్కడ కూడా తమ సత్తా చాటుకోవాలని చూస్తోంది.ఈ క్రమంలో రేవంత్ కు అన్ని విధాలుగా కాంగ్రెస్ సీనియర్ నేతలు సహకరించి, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి సారించకుండా… ఈ సమయంలోను ఆయనను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం కాంగ్రెస్ లో పరిస్థితిని తెలియజేస్తుంది.

పార్టీకు రాజీనామా వెళ్లే వారంతా రేవంత్ రెడ్డి పైనే విమర్శలు చేస్తుండగా , ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరేవారు రేవంత్ రెడ్డిని చూసే కాంగ్రెస్ లో చేరుతున్నారు.ఇప్పుడు ఉప ఎన్నికల సంగతి పక్కన పెడితే, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా, కాంగ్రెస్ లో ఇలా సొంత పార్టీ నాయకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ తమ ప్రధాన ప్రత్యర్థులైన టిఆర్ఎస్, బిజెపిలు మరింత బలపడే విధంగా ఛాన్స్ ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.







