తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నిర్వహించనున్న ‘చలో మేడిగడ్డ’( Chalo Medigadda ) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి( Jagga Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు రావాలన్నప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు మీరు రావాలంటే తాము ఎలా వస్తామని నిలదీశారు.
నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్(KCR ) మాట్లాడిన భాష సరైనదా అని నిలదీశారు.మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెప్పేంత వరకు కేసీఆర్,కేటీఆర్ మరియుు హరీశ్ రావు( Harish Rao )ను వదిలి పెట్టామని తెలిపారు.