యాదాద్రి భువనగిరి జిల్లా: స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా టైలర్ల బతుకులు మారలేదని,ఈ ప్రభుత్వంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు.బుధవారం ప్రపంచ ట్తెలర్స్ డే పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో దర్జీ సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ట్రైలర్స్ అసోసియేషన్ కు తన వంతుగా లక్ష రూపాయలు తన జీతంలో నుండి అందజేశారు.ప్రభుత్వం నుండి కూడా అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైలర్స అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి ఖలీల్, ఉపాధ్యక్షుడు యాకుబ్ స్వామి, కార్యదర్శి కటకం రాజు తదితరులు పాల్గొన్నారు.







