ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి, పిల్లలు అనే విషయాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
విలక్షణ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్న జగపతి బాబు ఎలాంటి పాత్రలో అయినా సులువుగా ఒదిగిపోతారు.
జగపతిబాబు నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.తన అస్తుల గురించి జగపతి స్పందిస్తూ తన ఆస్తులు ఎక్కడికీ పోలేదని అన్నారు.
ఆస్తి ఏ విధంగా పోయిందనే విషయం నాకు కూడా తెలియదని ఆయన కామెంట్లు చేశారు.నన్ను మోసం చేసిన వాళ్ల గురించి నేను ఆలోచించనని ఆయన తెలిపారు.
నేను ఎవరినీ బ్లేమ్ చేయనని 30 కోట్ల రూపాయలు ఉంటే సంతోషంగా బ్రతకొచ్చని నేను భావిస్తానని జగపతిబాబు అన్నారు.ఆస్తులు మిగల్చలేమని వ్యాపారం చేద్దామని అనుకున్నానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
ఇది నా సామర్థ్యం అని ఈ విషయాన్ని పిల్లలకు కూడా చెప్పేశానని జగపతి బాబు పేర్కొన్నారు.గతేడాదికి 30 కోట్ల రూపాయలు సంపాదించానని అంతకంటే ఎక్కువ సంపాదన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.కరోనా సమయంలో కోట్ల రూపాయలు ఉన్నా చాలామంది ప్రాణాలను కాపాడుకోలేకపోయారని జగపతి బాబు పేర్కొన్నారు.
రెండు ఫోన్లను చేతిలో పట్టుకుని అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.
నా పిల్లలు నేను చెప్పింది వినాలనుకోవడం రైట్ కాదని కుటుంబానిక్ రెస్పెక్ట్ ఇవ్వాలని జగపతి బాబు తెలిపారు.రెండో పెళ్లి గురించి ఆలోచించనని రెండో పెళ్లి చేసుకుంటే జీవితం క్రాష్ అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.చిన్నపాపకు పెళ్లి చేసుకోవద్దని చెప్పానని జగపతిబాబు పేర్కొన్నారు.
అందరు హీరోయిన్లను ఫ్రెండ్స్ లా భావిస్తానని అందరు హీరోయిన్లతో బాగుంటానని ఆయన అన్నారు.జగపతి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy