ఎదవలకంటూ ఐఫా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు.. ఏమైందంటే?

ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల( IIFA Awards ) వేడుక యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది బాలీవుడ్  నటీనటులు అలాగే సౌత్ ఇండియా సినిమా సెలెబ్రిటీలు కూడా పాల్గొన్నారు.

 Jagapathi Babu Sensational Comments On Iifa Awards ,jagapathi Babu,iifa Awards,-TeluguStop.com

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లతో పాటు సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే సందడి చేశారు.ఇక ఈ వేడుకలలో భాగంగా జగపతిబాబు ( Jagapathi Babu ) కూడా బెస్ట్ విలన్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Villan, Iifa Awards, Jagapathi Babu, Jagapathibabu, Tollywood-Movie

జగపతిబాబు ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తున్న ఈయన ఎక్కువగా విలన్ పాత్రలలోనే కనిపిస్తున్నారు.ఈ క్రమంలోనే జగపతిబాబు కన్నడలో నటించిన కాటేరా అనే సినిమాలో విలన్ పాత్రకు గాను ఈయనకు ఐఫా అవార్డు లభించింది.ఇక ఐఫా అవార్డు అందుకున్న ఈయన ఆ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Telugu Villan, Iifa Awards, Jagapathi Babu, Jagapathibabu, Tollywood-Movie

ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని పోస్ట్ చేసిన జగపతిబాబు ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి అంటూ సరదాగా కామెంట్ చేశారు అయితే ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఈయనకు అవార్డు పట్ల సరైన అభిప్రాయం లేదని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఆయన మాత్రం ఆ సినిమాలో నేను చాలా క్రూరమైన పాత్రలో నటించడం వలె నాకు ఈ అవార్డు వచ్చిందనే ఉద్దేశంతోనే చెప్పారు తప్ప అవార్డుల పట్ల సరైన అవగాహన లేక కాదు అంటూ మరికొందరు జగపతిబాబు పోస్టుకు సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube