ఎదవలకంటూ ఐఫా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగపతిబాబు.. ఏమైందంటే?

ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల( IIFA Awards ) వేడుక యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా అట్టహాసంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది బాలీవుడ్  నటీనటులు అలాగే సౌత్ ఇండియా సినిమా సెలెబ్రిటీలు కూడా పాల్గొన్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది యంగ్ హీరో హీరోయిన్లతో పాటు సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే సందడి చేశారు.

ఇక ఈ వేడుకలలో భాగంగా జగపతిబాబు ( Jagapathi Babu ) కూడా బెస్ట్ విలన్ అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే.

"""/" / జగపతిబాబు ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తున్న ఈయన ఎక్కువగా విలన్ పాత్రలలోనే కనిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే జగపతిబాబు కన్నడలో నటించిన కాటేరా అనే సినిమాలో విలన్ పాత్రకు గాను ఈయనకు ఐఫా అవార్డు లభించింది.

ఇక ఐఫా అవార్డు అందుకున్న ఈయన ఆ వేడుకలకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

"""/" / ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని పోస్ట్ చేసిన జగపతిబాబు ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి అంటూ సరదాగా కామెంట్ చేశారు అయితే ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈయనకు అవార్డు పట్ల సరైన అభిప్రాయం లేదని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆయన మాత్రం ఆ సినిమాలో నేను చాలా క్రూరమైన పాత్రలో నటించడం వలె నాకు ఈ అవార్డు వచ్చిందనే ఉద్దేశంతోనే చెప్పారు తప్ప అవార్డుల పట్ల సరైన అవగాహన లేక కాదు అంటూ మరికొందరు జగపతిబాబు పోస్టుకు సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే!