సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు( Jagapathi Babu ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన కుటుంబ ప్రేమ కథ చిత్రాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నారు.
ఇలా హీరోగా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి జగపతిబాబుకి క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరమైనటువంటి ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా జగపతిబాబు హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇలా విలన్ ( Villan ) పాత్రలలో ప్రస్తుతం ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు.హీరోగా సినిమాలు చేసిన దానికన్నా విలన్ గా చేయడంతోనే నాకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని డబ్బు కూడా ఎక్కువగానే సంపాదించానని పలు సందర్భాలలో తెలియజేశారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా మరొక పోస్ట్ చేశారు.తాను కనుక సినిమాలలోకి వచ్చి ఉండకపోతే కచ్చితంగా సూపర్ పోలీస్ ( Super Police ) అయ్యే వాడినని తెలిపారు.ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ పోలీసులు లాగా నేను కూడా లా అండ్ ఆర్డర్ నూ గడగడలాడించే వాడిని మీరేమంటారు? అంటూ ఈయన పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు.ఇక ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.