లెజెండ్ తర్వాత చేసినవన్నీ చెత్త సినిమాలే... జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు( Jagapathi Babu ) ఒకరు.ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి ఫ్యామిలీ కథ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 Jagapathi Babu Comments About Legend Movie, Jagapathi Babu, Legend Movie, Balakr-TeluguStop.com

అయితే సినిమాలలో హీరోగా అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతిబాబు తిరిగి లెజెండ్( Legend )సినిమా ద్వారా విలన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైనటువంటి విజయాన్ని అందుకున్నారు.

Telugu Balakrishna, Jagapathi Babu, Jagapathibabu, Legend, Tollywood-Movie

ఇక ఈ సినిమా 10 సంవత్సరాలు కావడంతో ఇటీవల చిత్ర బృందం సెలబ్రేషన్స్ నిర్వహించారు.అయితే ఈ కార్యక్రమంలో చిత్ర బృందం అందరూ పాల్గొన్నప్పటికీ జగపతిబాబు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

లెజెండ్ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు.ఈ సినిమాకు ముందు నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదని ఈయన వెల్లడించారు.

Telugu Balakrishna, Jagapathi Babu, Jagapathibabu, Legend, Tollywood-Movie

ఎవరైనా నాకు సినిమా అవకాశం కల్పిస్తే చాలు అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో లెజెండ్ అవకాశం వచ్చింది. అయితే విలన్ గా నేను నటిస్తానా లేదా అని వారు సందేహ పడ్డారు కానీ నేను ఏమాత్రం ఆలోచించకుండా సినిమాను ఓకే చేశాను.ఇక ఈ సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాకుండా నాకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.ఈ సినిమా తర్వాత దాదాపు ఒక వంద సినిమాలు చేశానని అయితే ఏ సినిమా కూడా ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను తీసుకురాలేకపోయిందని తెలిపారు.

రంగస్థలం, శ్రీమంతుడు, అరవింద సమేత వంటి సినిమాలు మినహా మిగిలిన ఏ సినిమాలు చెప్పుకోదగ్గ పాత్రలు రాలేదని లెజెండ్ ద్వారా వచ్చిన ఫేమ్ సరిగ్గా వాడుకొని ఉంటే నా కెరియర్ మరోలా ఉండేది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube