లెజెండ్ తర్వాత చేసినవన్నీ చెత్త సినిమాలే… జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు( Jagapathi Babu ) ఒకరు.

ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి ఫ్యామిలీ కథ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే సినిమాలలో హీరోగా అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతిబాబు తిరిగి లెజెండ్( Legend )సినిమా ద్వారా విలన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైనటువంటి విజయాన్ని అందుకున్నారు.

"""/" / ఇక ఈ సినిమా 10 సంవత్సరాలు కావడంతో ఇటీవల చిత్ర బృందం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

అయితే ఈ కార్యక్రమంలో చిత్ర బృందం అందరూ పాల్గొన్నప్పటికీ జగపతిబాబు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

లెజెండ్ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు.ఈ సినిమాకు ముందు నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదని ఈయన వెల్లడించారు.

"""/" / ఎవరైనా నాకు సినిమా అవకాశం కల్పిస్తే చాలు అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో లెజెండ్ అవకాశం వచ్చింది.

అయితే విలన్ గా నేను నటిస్తానా లేదా అని వారు సందేహ పడ్డారు కానీ నేను ఏమాత్రం ఆలోచించకుండా సినిమాను ఓకే చేశాను.

ఇక ఈ సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాకుండా నాకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.

ఈ సినిమా తర్వాత దాదాపు ఒక వంద సినిమాలు చేశానని అయితే ఏ సినిమా కూడా ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను తీసుకురాలేకపోయిందని తెలిపారు.

రంగస్థలం, శ్రీమంతుడు, అరవింద సమేత వంటి సినిమాలు మినహా మిగిలిన ఏ సినిమాలు చెప్పుకోదగ్గ పాత్రలు రాలేదని లెజెండ్ ద్వారా వచ్చిన ఫేమ్ సరిగ్గా వాడుకొని ఉంటే నా కెరియర్ మరోలా ఉండేది అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు 2025 కలిసి వస్తుందా..?