ఏపీలో సీఎం జగన్ పాలనను గాలికి వదిలేశారని టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు.ప్రజాధనం దోచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కట్టలేదన్న నారా లోకేశ్ ఉన్నవాటిని కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







