డివైడ్ అండ్ రూల్ పాలసీ గురించి అందరం వినే ఉంటాం.అంటే విభజించు పాలించు ఈ విధానాన్ని అప్పట్లో బ్రిటిష్ వారు గట్టిగా ఫాలో అయ్యారు.
ఇప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.అంటే రాష్ట్రాన్ని రెండుగా చీల్చడం కాదండోయ్.
ఓటర్లను రెండుగా చీల్చడం.వైసీపీ పాలన కోరుకునే వారిని వైసీపీకి వ్యతిరేకంగా నిలిచే వారిని రెండుగా డివైడ్ చేసేందుకూ జగన్ ప్రయత్నిస్తున్నారా.? అంటే తాజాగా మంత్రి ధర్మాన ప్రసాద్ రావు వ్యాఖ్యలను బట్టి చూస్తే అవునేమో అనే సందేహం కలుగక మానదు.
ధర్మాన మాట్లాడుతూ .వచ్చే ఎన్నికల్లో ప్రజాలో ఎవరికి ఓటు వేస్తారో గుర్తించాలని, వారిలో వైసీపీకి ( YCP )ఓటేసేవారు, వైసీపీకి ఓటు వేయని వారు, మరియు తటస్థంగా ఉండే వారిని వేర్వేరుగా గుర్తించాలని వాలెంటిర్లకు సూచించారు ధర్మాన.అంతేకాకుండా ఎవరైనా వైసీపీకి ఓటు వేస్తామని చెబితే వారిచేతే దేవుడిపై ఒట్టు వేయించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .
ప్రస్తుతం ధర్మాన ప్రసాదరావు( Dharmana Prasada Rao ) చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.అసలు మంత్రి ఇలా ఎందుకు మాట్లాడారు ? ఇవి సొంత వ్యాఖ్యలా.లేక పార్టీ పరమైన వ్యాఖ్యాలా ? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పై ఎంతో కొంత వ్యతిరేకత ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికలతో ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా గట్టిగానే తెలిసింది.దాంతో వచ్చే ఎన్నికలతో అధికారం చేజారిపోయే అవకాశం ఉందనే భయం జగన్ లోనూ అటు నేతల్లోనూ కనిపిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.అందుకే వైసీపీకి మద్దతుగా నిలిచే వారిని వైసీపీ పై వ్యతిరేకత కనబిరిచే వారిని వేరు చేసి జగన్( CM Jagan ) ప్రభుత్వానికి అండగా నిలిచే వారిపైనే ఎక్కువ ఫోకస్ చేసే ఆలోచనలో వైసీపీ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది.ధర్మాన వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉండడంతో డివైడ్ అండ్ రూల్ వైపు వైసీపీ చూస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రాజకీయ వాదులు.మొత్తానికి వైసీపీకి ఓటమి భయం ఉందనే విషయం తాజాగా ధర్మాన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందనేది కొందరి అభిప్రాయం.మరి ధర్మాన చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగా కొంత చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.