ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పై జగన్ కసరత్తు ! లిస్టులో ఉంది వీరే!?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సందడి నెలకొంది.ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం,  గతంలో జగన్ కొంతమందికి హామీలు ఇవ్వడం, ఇప్పుడు వారంతా తమకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించాలంటూ జగన్ పై ఒత్తిడి చేస్తుండడం తదితర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 Jagan's Exercise On The Selection Of Mlc Candidates! Who Is On The List , Ap Mlc-TeluguStop.com

ఇప్పటికే శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున అభ్యర్థులు రంగంలోకి దిగారు.

అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైసిపి అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు.అది కూడా తొలి దశకు చేరుకుంది.

స్థానిక సంస్థల తో పాటు , ఎమ్మెల్యే, గవర్నర్ కోటలో ఖాళీ అయిన , ఖాళీ అవుతున్న స్థానాలు అన్ని వైసిపి ఖాతాలోకే చేరబోతున్నాయి.  దీంతో పార్టీలో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కించుకునేందుకు ఆశావాహులు పోటీ పడుతున్నారు.

Telugu Ap, Ap Mlcs, Ap Tdp, Chandrababu, Jagan, Mlc, Ysrcp-Politics

వీరి ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు.ప్రాంతాలు, విధేయత, సామాజిక వర్గాల సమతూకం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్ కసరత్తు మొదలుపెట్టారు.ఇప్పటికే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన తొమ్మిది స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.వచ్చే నెల 29లతో ఎమ్మెల్యేల కోటాలో మరో ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి.

మొత్తంగా 16 స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి.వీటితోపాటు గవర్నర్ కోటాలను రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి.

  దీంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జగన్ ఫైనల్ లిస్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు.గతంలో హామీ ఇచ్చిన వారికి ప్రాధాన్యం కల్పించాలని చూస్తున్నారు.

ఇక 18 స్థానాలకు సంబంధించి దాదాపు ఎంపిక పూర్తయింది .ఓకే స్థానం నుంచి ఒకరిద్దరు పేర్లను సిద్ధం చేశారు.  వారిలో ఒకరిని ఫైనల్ చేయబోతున్నారు.వారి వివరాలు చూస్తే ఏలూరు జిల్లా నుంచి జయ  మంగళ వెంకటరమణ , కడప జిల్లా నుంచి రామసుబ్బారెడ్డి,  తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడుపూడి సూర్యనారాయణ,  అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిచ్చల్ లో ఒకరి పేరు ను ఖరారు చేయబోతున్నారు.

Telugu Ap, Ap Mlcs, Ap Tdp, Chandrababu, Jagan, Mlc, Ysrcp-Politics

పశ్చిమగోదావరి జిల్లాలో వంక రవీంద్ర లేదా గుణ్ణం నాగబాబులో ఒకరికి అవకాశం కల్పించను న్నారు.శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నరసారామారావు పేర్లను పరిగణలోకి తీసుకున్నారు.అలాగే గవర్నర్ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్,  పోతుల సునీతకు తిరిగి రెన్యువల్ చేసే అవకాశం కనిపిస్తోంది.శ్రీకాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్లు పరిగణలోకి తీసుకుంటున్నారట.

గన్నవరం నుంచి వైసిపి ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ పోటీ చేయబోతుండడంతో,  ఆ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.అలాగే కర్నూలు జిల్లాకు చెందిన చల్లా శ్రీలక్ష్మి,  ప్రకాశం జిల్లా నుంచి జంకె వెంకటరెడ్డి పేర్లను పరిగణలోకి తీసుకున్నారట.

ముస్లిం కోట నుంచి గుంటూరు నుంచి జయవుద్దీన్ లేదా మరి రాజశేఖర్ కు అవకాశం ఇవ్వబోతున్నారట.అలాగే విజయవాడ నుంచి బొప్పన పవన్ కుమార్ పేరును కూడా పరిగణలోకి తీసుకున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube