జగన్ సూటి ప్రశ్న :  ఇన్ని పథకాలు ఎప్పుడైనా తెచ్చారా .. హామీలు అమలు చేశారా ? 

ఏపీలో ఎన్నికల ప్రచార తంతు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో,  వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) విపక్షాలను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా, తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన మేలు,  గత టిడిపి ప్రభుత్వంలో చోటుచేసుకున్న అభివృద్ధికి మధ్య తేడాలను వివరిస్తూ జనాలలో ఆలోచన రేకెత్తే విధంగా ప్రసంగం చేశారు.

మంగళగిరిలో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ప్రజలను ఉద్దేశించి అనేక సూచనలు చేశారు.

చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ముగింపు పలికినట్లేనని,  జగన్ కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని ప్రజలకు వివరించారు.రాబోయే ఐదేళ్లలో ఇంటింటికి పథకాలు అందిస్తామని జగన్ అన్నారు .మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనిని, ఈ ఐదేళ్లలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామని, ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా మార్పులు తీసుకొచ్చామని జగన్ ప్రజలకు వివరించారు.

Jagans Direct Question Have You Ever Brought So Many Schemes Have The Promises

 గ్రామాల్లో మార్పులు చూస్తే అర్థమవుతుందని,  ప్రతి గ్రామంలో సచివాలయంతో పాటు,  రైతు భరోసా( Rythu Bharosa ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామని , ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పింఛన్ అందించిన ఘనత వైసిపి ప్రభుత్వందేనిని జగన్ అన్నారు.  అక్క చెల్లెలమ్మలను ఆదుకునేందుకు అన్ని పథకాల నగదు సొమ్మును వారి ఖాతాలోనే వేస్తున్నామని అన్నారు.అక్క చెల్లెమ్మలకు కుటుంబంలోనే కాకుండా బయట కూడా గౌరవం పెంచే విధంగా ఈ ఐదేళ్లలో కృషి చేస్తామని,  పేదల బిడ్డలు బాగా చదువుకోవాలని , విద్యారంగంలో సమూల మార్పులు చేపట్టామని వివరించారు.

Jagans Direct Question Have You Ever Brought So Many Schemes Have The Promises

 ఇంగ్లీష్ మీడియం తెచ్చి విద్యార్థులకు ట్యాబ్ లో కూడా అందించామని జగన్ అన్నారు .నాడు నేడు( Nadu Nedu) కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ బాగా బాగుపడ్డాయని,  15 ఏళ్ల తర్వాత ఆ పిల్లాడు ఉన్నత విద్య చదివి అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ మంచి ఉద్యోగం చేస్తే పేదల భవిష్యత్తు మారదా అని జగన్ ప్రశ్నించారు.రైతుల కోసం రైతన్న భరోసా , ఇన్పుట్ సబ్సిడీ , విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది నిజం కాదా అని ప్రశ్నించారు .అవ్వ , తాతలకు ₹3,000 పింఛను నేరుగా ఇంటికే చేర్చిన ఘనత మీ బిడ్డ ఘనత కాదా అని జనాలను ప్రశ్నించారు.మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఎన్ని పథకాలు తెచ్చారా ? 14000 ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి పేరు చెబితే పేద వాడి కోసం చేసిన ఒక్క మంచి పనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు( Chandrababu ) ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను అమలుపరిచారా అని ప్రశ్నించారు.మళ్ళీ కొత్త మేనిఫెస్టో పేరుతో డ్రామాలతో మీ ముందుకు వస్తున్నారని,  దానిని ఎవరు నమ్ముతారు అని జగన్ ప్రశ్నించారు.

Advertisement
Jagans Direct Question Have You Ever Brought So Many Schemes Have The Promises
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

తాజా వార్తలు