MP Kesineni Nani : చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో 20రెట్లు ఉద్యోగాలు ఇచ్చారు..ఎంపీ కేశినేని నాని

మైలవరం ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ వీడితే మైలవరంలో పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటుందని అనుకున్నారుజగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ని ఎవరైనా చాలెంజ్ చేయగలరా?పక్కా లోకల్, పేదవాడు, యాదవ కులస్తుడు ని నిలబెట్టి గెలిపిస్తా చూడమని సర్నాల తిరుపతిరావు యాదవ్ ని ఇన్చార్జి గా నియమించారు మైలవరం వీరప్పన్, ఇసుక, మట్టి, బూడిద దోచుకునే అపర కుభేరుడిపై ఇలాంటి పేదవాడిని పెట్టారని అందరూ అనుకున్నారునేను మీరు అలా అనుకోలేదు, జగన్మోహన్ రెడ్డి సత్తా చూపిద్దామని అనుకున్నాంగతంలో చంద్రబాబు గుడివాడ సభకు వెళ్తే ఇక్కడున్న వారిలో సగం మంది లేరుచంద్రబాబు( Chandrababu ) ది సొల్లెక్కువ పని తక్కువ అని అప్పుడే అనుకున్నానుఎవరైతే ఎమ్మెల్యేని దొంగ అన్నారో అక్కడికెళ్ళి దొంగలతో చేరారు మీ అభిమానం, ఆత్మీయత చూస్తుంటే ఎన్ని వందల కోట్లు పెట్టినా మైలవరం కి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి దొరకడు వైసీపీ మైలవరం నియోజకవర్గ( Mylavaram ) కార్యకర్తలు అంటే ఏంటో ఇవాళ మీరు చూపించారుఎవరు పోటీ చేసినా ఇవాళ వారి ఓటమిని మీరు వ్రాశారుసర్నాల మైలవరం చరిత్రని తిరగరాయబోతున్నాడు నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర్నుండి గెలిచిన కమ్మ సామాజికవర్గానికి భిన్నంగా సర్నాల బీసీ అభ్యర్థిగా గెలవబోతున్నారు పులివెందుల తర్వాత అత్యధిక మెజారిటీ మైలవరం కి వస్తుంది జగన్మోహన్ రెడ్డి కి తప్ప సామాన్యుడిని నిలబెట్టి గెలిపించే సత్తా ఏ పార్టీకి లేదువిజయవాడ పశ్చిమ, పత్తిపాడు లాంటి నియోజకవర్గాల్లో సామాన్యులను ఎమ్మెల్యే గా నిలబెట్టారు.

 Jaganmohan Reddy Has Given 20 Times More Jobs Than Chandrababu In Five Years Mp-TeluguStop.com

నందిగామ సురేష్ లాంటి వ్యక్తిని ఎంపీ చేసిన ధైర్యం కలిగాన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 126సార్లు బటన్ నొక్కి కరోనా కష్ట కాలంలో రెండున్నర లక్షల సంక్షేమం అందించారుచంద్రబాబు నాతో చర్చకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏంటో నేను చెప్తా చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళలో 20రెట్లు ఉద్యోగాలు ఇచ్చారుఒక్క సెక్రటేరియట్ చంద్రబాబు హయాంలో కట్టలేక పోయారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు, మెడికల్ కాలేజీలు, పోర్ట్ లు, హార్బర్ లు కట్టారు జగన్మోహన్ రెడ్డి కుప్పం వెళ్ళి చంద్రబాబు త్రాగడానికి నీళ్ళు ఇచ్చారు సిగ్గులేని చంద్రబాబు చంద్రగిరి లో ఓడిపోయి కుప్పం వెళ్ళి అక్కడ నీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు కుప్పానికే సంక్షేమం, అభివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారు ప్రతి ఎలక్షన్ కి ముందు బీసీలు మైనారిటీలు, ఎస్సీలు, పేదవాళ్ళు చంద్రబాబు కి గుర్తొస్తారు ఒక్క హామీ నెరవేర్చని వ్యక్తి, పచ్చి మోసగాడు, వాడుకుని వదిలేస్తారుచంద్రబాబు ఆయన పనికి మాలిన కొడుకు లోకేష్ కి తప్ప ఎవరికీ ఏమీ చెయ్యడు పేదవాడికి ఒక్క ఇల్లు ఇవ్వని చంద్రబాబు ఆయన కొడుక్కి జూబ్లీహిల్స్ లో భవంతి కట్టుకున్నాడు, ఫర్నీచర్ ఇటలీ నుండి తెప్పించారు మనమంతా బావుండాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి, చంద్రబాబు అక్కరలేదు 2024 లో ఇక్కడ తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారుఎన్టీఆర్( NTR ) పార్టీ పెట్టిన 40ఏళ్ళ తర్వాత ఒక్క ఎమ్మెల్సీ లేని స్ధితికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ని తీసుకెళ్ళారు కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో మరొక్క సారి ఆయన కొడుకు ఓడిపోతున్నారు ఏ ధనవంతుడు వచ్చినా మైలవరంలో గెలవలేడు, ఇప్పటికే ఇక్కడ పోటీ చేయాలనుకునే వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube