అవినాష్ ను కాపాడుతోంది జగనే.. షర్మిల ఫైర్ 

మరోసారి తన అన్న,  వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పై విమర్శలతో విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( Sharmila ) .

ముఖ్యంగా తన చిన్నాన్న వైఎస్  వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంపై షర్మిల విమర్శలు చేశారు.

అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి జగన్ వారసుడే కాదని షర్మిల విమర్శించారు.బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లా , మైదుకూరు నియోజకవర్గం( Maidukuru Constituency ) బ్రహ్మంగారి మఠంలో షర్మిల పర్యటిస్తూ అనేక విమర్శలు చేశారు.

  వైయస్ పాలనకు,   జగన్ పాలనను పొంతనే లేదని, భూతద్దం పెట్టి చూసినా ఆ ఆడవాళ్లు కనిపించవని షర్మిల విమర్శించారు.వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సిబీఐ చెప్పిందని,  కాల్ రికార్డులు,  గూగుల్ మ్యాప్స్ ఉన్నట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు.

Jagane Sharmila Is Saving Avinash, Jagan, Ysrcp, Ap Government, Bjp, Ap Congress

అన్ని ఆధారాలు ఉన్నా,  అతడిని జగన్ కాపాడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్ మోసం చేశారు వైఎస్సార్ హయాంలో రైతు రారాజు,  ఇప్పుడు అప్పులేని రైతే లేడు.

Advertisement
Jagane Sharmila Is Saving Avinash, Jagan, Ysrcp, Ap Government, BJP, Ap Congress

పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదు.డ్రిప్ వేసుకోవడానికి అవకాశం లేకుండా సబ్సిడీలు అన్ని ఆపేశారు.సంపూర్ణ మధ్య నిషేధం హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వమే విక్రయిస్తోంది.

  ఇష్టారీతున అమ్ముతున్నారు .కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు .మెగా డీఎస్సీ( Mega DSC ) వేస్తామని చెప్పారు.నాలుగున్నర ఏళ్లు నిద్రపోయి కేవలం 6000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.

జగన్ ది హత్య రాజకీయాలు చేసే పాలన సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు.నిందితుడిగా ఉన్న అవినాష్ కే మళ్లీ టికెట్ ఇచ్చారు.

Jagane Sharmila Is Saving Avinash, Jagan, Ysrcp, Ap Government, Bjp, Ap Congress

 అతడు చట్టసభల్లోకి వెళ్ళకూడదు.అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా, న్యాయం కోసం పోరాటం ఓవైపు,  హంతకులు మరోవైపు.ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

హంతకులకు ఓటు వేయవద్దు.వైఎస్సార్ బిడ్డను గెలిపించాలని కోరుతున్నా, ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా   అంటూ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు