ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరుస గా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోలుగా కూడా చాలా సంవత్సరాల పాటు వెలుగొండారు.ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం రేంజ్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో శ్రీకాంత్, జగపతి బాబు లు మొదటి వరుసలో ఉంటారు.
ఇక వీళ్ళిద్దరూ చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్( Srikanth ) సక్సెస్ సాధించడానికి ముఖ్యంగా ఈ దర్శకులు కీలకపాత్ర వహించారనే చెప్పాలి.
ఇక అందులో మొదటి వ్యక్తి ఎస్ వి కృష్ణారెడ్డి ఈయన శ్రీకాంత్ తో చాలా సినిమాలు చేసి ఆయనకు మంచి బ్రేక్ ను అందించాడు.
![Telugu Khadgam, Krishna Vamsi, Mahatma, Pelli Sandadi, Srikanth-Movie Telugu Khadgam, Krishna Vamsi, Mahatma, Pelli Sandadi, Srikanth-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Srikanth-Kovelamudi-Raghavendra-Rao-pelli-sandadi-Khadgam-Krishna-Vamsi-E-V-V-Satyanarayana.jpg)
ఆ తర్వాత రాఘవేంద్రరావు( Kovelamudi Raghavendra Rao ) ఈయనతో చేసిన పెళ్లి సందడి సినిమా సూపర్ సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా శ్రీకాంత్ కెరియర్ లోనే అదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయింది… ఇక ఎప్పుడు కామెడీ సినిమాలు తో ఎంటర్ టైన్ చేసే ఈవివి సత్యనారాయణ( E V V Satyanarayana ) కూడా శ్రీకాంత్ ను హీరోగా పెట్టి చాలా సినిమాలు చేశాడు.ఇక అందులో చాలా ఎక్కువ పర్సెంట్ సక్సెస్ లు ఉండడం విశేషం.ఇక ఈ దర్శకులతో పాటు గా కృష్ణ వంశీ( Krishna Vamsi ) కూడా శ్రీకాంత్ జీయర్ ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఖడ్గం సినిమా( Khadgam ) సూపర్ సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకు ఒక మంచి క్రేజ్ ను కూడా తీసుకొచ్చిన సినిమాగా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.
![Telugu Khadgam, Krishna Vamsi, Mahatma, Pelli Sandadi, Srikanth-Movie Telugu Khadgam, Krishna Vamsi, Mahatma, Pelli Sandadi, Srikanth-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/Kovelamudi-Raghavendra-Rao-Mahatma-pelli-sandadi-Khadgam-Krishna-Vamsi-E-V-V-Satyanarayana.jpg)
ఆయన పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా సీరియస్ గా ఉండడంతో శ్రీకాంత్ పోలీస్ పాత్రను అలవోకగా చేయగలడు అనే పేరైతే సంపాదించుకున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ‘ మహాత్మా ‘ అనే సినిమాతో తనని తాను హీరోగా మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు.ఇలా కృష్ణవంశీ కూడా శ్రీకాంత్ కెరియర్ ను గాడిలో పెట్టడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడనే చెప్పాలి…
.