నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలకు పెద్దగా బాధ్యతలు అప్పగించలేదు.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా తీసుకు వచ్చిన వలంటీర్ వ్యవస్థకే సీఎం జగన్ అన్ని బాధ్యతలు అప్పగించారు.
ప్రజలతో వారినే కనెక్ట్ చేశారు.ఏది కావాలన్నా.
ప్రజలు వలంటీర్‌కు ఫోన్లు చేయాలని సూచించారు.ఇక, ప్రజలు కూడా వలంటీర్ల వైపే మొగ్గు చూపారు.
దీంతో ఎమ్మెల్యేలు దాదాపుగా డమ్మీలయ్యారు.ప్రజలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయింది.
ఫలితంగా ఎమ్మెల్యేలు ఏపనికీ పనికిరాకుండా పోయారనే భావన వ్యక్తమైంది.అయితే.
ఇప్పుడు పరిస్థితి తిరగబడింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వలంటీర్లనుపూర్తిగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఇప్పుడు ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధులు లేకుండా పోయారు.ఏమాత్రంతేడా వచ్చినా.వలంటీర్లను ఇంటికి పంపేస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా రాత్రికి రాత్రి .పంచాయతీ ఎన్నికలబాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ.ప్రభుత్వ సలహాదారు.
సజ్జల రామకృష్నారెడ్డి.మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

అయితే.ఇన్నాళ్లలో ప్రజలకు తమకు మధ్య కనెక్టివిటీ లేకుండా పోయిందని.ఇప్పుడు తాము ఏం చేస్తామని మెజారిటీ ఎమ్మెల్యేలు ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు.పైగా.గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకంటే .కూడా వలంటీర్ల హవానే ఎక్కువగా నడిచింది.ఈ నేపథ్యం లో ఇప్పుడు ఎన్నికల బాధ్యతను తమపై పెట్టడంపై ఎమ్మెల్యేలు చిర్రుబుర్రులాడుతున్నారు.ముఖ్యంగ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఈ తరహ పరిస్థితి కనిపిస్తోంది.
నెల్లూరులో అయితే.ఇప్పటి వరకు మంత్రులు దూకుడగా వ్యవహరించారని.
వారినే చూసుకోవాలని.ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం బాహాటంగానే ప్రకటిస్తున్నారు.
మరికొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఇంటికే పరిమితమయ్యారు.ఇక, మంత్రులు ఎవరూ బయటకు రావడం లేదు.
గ్రామాల్లో పర్యటించడమూ లేదు.ఈ పరిణామాన్ని ఊహించని వైసీపీ పెద్దలు ఇప్పుడు తలలు పట్టుకోవడం గమనార్హం.
మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.