ఉలకరు... పలకరు : జగన్ కు తలనొప్పిగా కొందరు ?

తాము ఏం చేసినా,  ఏం చెప్పినా , అంతిమంగా ప్రజలకు మేలు చేసేది గా ఉండాలనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్తున్నారు.

ఈ పథకాలు, ఈ ఉచితాలు అన్ని అందులోనివే.

తానే కాదు తన పార్టీ నాయకులు , మంత్రులు,  ఎమ్మెల్యేలు అధికారులు ఎవరైనా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని క్షేత్రస్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జగన్ పదేపదే కోరుతున్నారు.ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని క్షేత్రస్థాయిలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జగన్ పదేపదే అందరికీ హిత బోధ చేస్తూ వస్తున్నారు .అయిన పార్టీ నాయకుల్లో చాలామందిలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది.  అధికారులే మొత్తం చక్క పెట్టుకుంటూ  వెళ్తున్నారనే అభిప్రాయంతో నాయకులు ప్రజా సమస్యల విషయంలో పెద్దగా పట్టించుకున్నట్టు గా వ్యవహరిస్తున్నారు.

  ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వంటివి తమకు ఇబ్బందిగా మారాయని నాయకులు చాలాకాలం నుంచి ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నారు .అయినా, జగన్ మాత్రం ఎవరి పని వారిదే అన్నట్లుగా చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకుంటూ,  ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎమ్మెల్యేలు మంత్రులకు,  నియోజకవర్గ స్థాయి నాయకులకు హితబోధ చేస్తూ వస్తున్నారు.

  అయినా నాయకుల్లో నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోందట .చాలామంది ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు నాయకుల వద్దకు వస్తున్న,  పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్నారట.ఈ వ్యవహారాలపై జగన్ కు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు అందుతుండటంతో జగన్ అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది .

Advertisement

 పనితీరు సక్రమంగా లేని మంత్రులు ఎమ్మెల్యేల లిఫ్ట్ కూడా రెడీ అయిందట.ఇప్పటికే ఇటువంటి నాయకుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ సలహాదారుల ద్వారా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో మార్పు రాకపోవడంతో  ఈ తరహా నాయకుల వ్యవహార శైలి జగన్ కు పెద్ద తలనొప్పిగా మారడంతో త్వరలోనే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు