"మార్పు" కోరుకుంటున్న జగన్

వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్సెంబ్లీ సాక్షిగా తాను చేస్తున్న ప్రసంగాలు అన్నింటినీ ఒకసారి రిప్లే చేసుకుని చూసుకుంటున్నాడు.

 Jagan Stats Damag Control-TeluguStop.com

ఎందుకంటే ప్రభుత్వం పై రాజధాని విషయంలో ఒత్తిడి తెస్తూ ఇరగదీసేస్తున్నాం అనుకుంటున్న జగన్ అండ్ పార్టీ కి పాపం బయట జరుగుతున్న విషయాలు తెలియక తమ భుజాలను తామే శెభాష్ అంటూ చరుచుకుంటున్నారు.అయితే ఇవన్నీ ఇలా ఉంటే బయట జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ నాయకులు జగన్ దృష్టికి తీసుకురావడంతో అలెర్ట్ అయిన జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యతిరేకత నుంచి బయట పడాలి అని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

మొదట్లో జగన్ అండ్ పార్టీ తాము ప్రతిపాదించిన చోట కాకుండా కృష్ణా-గుంటూరు నడుమనే ఎందుకు రాజధాని నిర్మిస్తున్నారు అంటూ ప్రభుత్వం పై వ్యతిరేకతను ప్రదర్శించగా, ఆ ప్రాతంలోని ప్రజలు ఆయా ప్రాంతాల్లో వైకాపాపై తమ వ్యతిరేకతను చూపించారు.దానితో చేసేది ఏమీలేక జగన్ మాట మార్చేసి తమ ఉద్దేశం ఆ ప్రాంతంలో ఎందుకు పెడుతున్నారు అని కాదు అని, వ్యవసాయ భూములు లేని చోట, ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న చోట పెడితే మంచిది అని ఆయన వివరణ ఇచ్చారు.

ఏది ఏమైన పాపం జగన్ తమ వ్యవహార శైలిలో మార్పు కోరుకుంటున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదండోయ్!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube