వచ్చే ఎన్నికల్లో వైసీపీని( YCP ) గెలిపించడంతో పాటు, తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థైన టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu ), ఆయన కుమారుడు నారా లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ).ఈ మేరకు చంద్రబాబు పోటీ చేయబోతున్న కుప్పం నియోజకవర్గంతో పాటు, లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ , వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చెందారు.ఇప్పుడు మరోసారి లొకేష్ ను ఓడించి, ఆయన శాసనసభలో అడుగు పెట్టకుండా చూసుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.
ఇక చంద్రబాబు కుప్పం నుంచే వరుసగా గెలుస్తూ వస్తున్నారు.ఇటీవల కాలంలో కుప్పంలో వైసిపి హవా కనిపిస్తోంది.మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కుప్పం మున్సిపాలిటీనీ వైసిపి గెలుచుకుంది.ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) ప్రత్యేకంగా దృష్టి పెట్టి చంద్రబాబు ఓటమికి వ్యూహరచన చేస్తున్నారు.
టిడిపిలోని కీలక నేతలందరినీ ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటున్నారు.ఇక్కడ వైసిపి అభ్యర్థిగా భరత్ ను ప్రకటించారు.ఇక మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవిని ప్రకటించారు.చేనేత సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉండడం, ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం వారే ఎక్కువగా ఉండడంతో లోకేష్ ను ఓడించడం సులువుతుందనే అంచనాలో ఉన్నారు.
అయితే కొద్దిరోజులుగా మంగళగిరి నియోజకవర్గంలోని( Mangalagiri Constituency ) వైసిపి కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చిరంజీవి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీంతో అక్కడ వైసిపి ఇబ్బందికర పరిస్తితులను ఎదుర్కొంటోంది.
దీంతో చిరంజీవిని మార్చుతారనే ప్రచారం జరుగుతున్నా, జగన్ మాత్రం చిరంజీవిని కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నారు.రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా అక్కడ ఇన్చార్జిగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డిని( Vijaya Sai Reddy ) ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ నియమించారు.
దీంతో విజయసాయిరెడ్డి ఈ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.అసంతృప్తి నేతలుగా ఉన్న కాండ్రు కమల , హనుమంతరావు లతో చర్చించడంతో పాటు, వారిని జగన్ వద్దకు తీసుకువెళ్లారు.
జగన్ వారిని పిలిపించుకుని నచ్చ చెప్పడంతో వారు మెత్తబడినట్టుగానే కనిపిస్తున్నారు.
లోకేష్ ను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకోవాలని, గ్రూపు రాజకీయాలను వదిలిపెట్టాలని జగన్ సూచించడంతో హనుమంతరావు, కమలలు చిరంజీవి కి సహకరించే విధంగా సానుకూలతను వ్యక్తం చేశారు.చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసిపి మార్క్ కనిపించేలా ప్రత్యేక కార్యచరణను రూపొందించారు.కుప్పం మున్సిపాలిటీ తో పాటు, ఐదు మండలాల్లో అభివృద్ధి పనులనూ వేగవంతం చేశారు.