పాడిందే పాటరా పాచిపళ్ల దాసరి అంటూ తెలుగులో ఒక సామెత ఉంది.అంటే, అది నిజం కాదని అందరికీ తెలిసినప్పటికీ, విషయం లేకున్నా కబుర్లు చెప్పడం సులుభమనేది దీని అర్ధం.
అయితే తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందూ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ మూడు రాజధానుల నిర్ణయం ఆచరణాత్మకమని పేర్కొన్నారు.అమరావతి నిర్మాణానికి 1,08,000 కోట్లు ఖర్చు అవుతుందని, పూర్తి కావడానికి 20 ఏళ్లు పడుతుందని చెప్పారు.“చంద్రబాబు నాయుడు , అతని అనుచరగణం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో ఉన్నారు. వారు ఇప్పుడు తమ రియల్ ఎస్టేట్ గురించి ఆందోళన చెందుతున్నారు” అని సిఎం జగన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతి పక్షాలు విరుచుకుపడ్డాయి. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతున్న జగన్ ఇప్పటికీ ఒక్క తప్పు కూడా రుజువు చేయలేక ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ ప్లాంక్‌ను ఉపయోగిస్తున్నారని విమర్శస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి అదే ఇంటర్వ్యూలో రాజధాని విశాఖపట్నంకు మారడం గురించి కూడా ప్రస్తవించాడు, పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి అన్నారు.
ఏడాది కాలంగా మౌనం వహించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడమే కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్ ప్రభుత్వం దూకుడుగా వ్వవహారిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్క్‌షాప్‌లు, సమావేశాలు మరియు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతోపాటు వికేంద్రీకృత పరిపాలన కోసం పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం చేయడం ముఖ్యమంత్రి విస్తృత వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవిల్లి వరకు చేపట్టిన పాదయాత్ర మూడు రాజధానుల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి తక్షణ కారణంగా భావిస్తుంది.