గోదావరి జిల్లాలలో కొత్త సమీకరణానికి తెర తీస్తున్న జగన్ ??

జనసేన తెలుగుదేశం కూటమి( TDP Janasena Alliance ) ద్వారా విన్నింగ్ కాంబినేషన్ సెట్ చేసి సామాజికంగా ఒక బలమైన ఓటు బ్యాంకు నుండి నిర్మించుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి జగన్ ( CM Jagan ) ఇప్పుడు ఒక కొత్త సమీకరణానికి తెర తీస్తున్నట్టుగా తెలుస్తుంది.ఉభయగోదావరి అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికలలో కీలకంగా మారబోతున్నాయని , ఇక్కడ ఉన్న 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త కాంబినేషన్ కు తెరతీసింది గతం లో బీసీలు ( BC ) అధిక భాగం తెలుగుదేశానికి అనుకూలంగా ఉండటం కాపు సామాజిక వర్గం లో జనసేనకు బలం ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ ఉబయ గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో ఇప్పుడు జగన్ బీసీల ను దళితులను ఆకట్టుకుని మెజారిటీ స్థానాలను ఆయా సామాజిక వర్గ అభ్యర్థులకు ఇవ్వడం ద్వారా గట్టి పోటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 Jagan Is Trying New Formula In Ap Details, Cm Jagan Mohan Reddy, Tdp, Janasena,-TeluguStop.com
Telugu Cmjagan, Dalits, Janasena, Kapu, Tdpjanasena-Telugu Political News

గోదావరి జిల్లాల్లో సహజంగానే కాపు వర్సెస్ బీసీ వాతావరణ ఉంటుంది.జనసేన ఎలానో కాపు సామాజిక వర్గానికి అధిక సీట్లు ఇస్తుంది అన్న అంచనాలు ఉండడంతో బిసి లలో కొంత ఓట్ బ్యాంక్ ఆ కూటమికి వ్యతిరేఖం గా మారే అవకాశం ఉంది .బీసీలను దళితులను వారికి పోటీగా నిలబెట్టడం ద్వారా ఆ ఓట్ బ్యాంక్ ని తమ పార్టీ వైపు మళ్లించుకోవడానికి కొత్త సమీకరణానికి జగన్ తెరతీస్తున్నారని తద్వారా గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతాయని పరిస్థితి వైసీపీ కనుకూలంగా మారుతుందని జగన్ లెక్కలు వేస్తున్నారు.

Telugu Cmjagan, Dalits, Janasena, Kapu, Tdpjanasena-Telugu Political News

మరోపక్క బలంగా ఉన్న ముద్రగడ లాంటి బలమైన అభ్యర్థులు ఉన్నచోట కాపు సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వాలని మిగిలిన చోట్ల బీసీ దళిత నాయకులను పోటీకి నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నదట.ఎట్టి పరిస్థితులను ఉబయ గోదావరి జిల్లాలలో పట్టు కోల్పోకూడదు అన్న ఆలోచనతో వైసిపి అధిష్టానం ఆలోచనలు చేస్తుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube