వైసిపి ఏపీ సీఎం జగన్ రాబోయే ఎన్నికల విషయంలో క్లారిటీతోనే ఉన్నారు.తప్పకుండా మళ్ళీ వైసీపీకే ప్రజలు పట్టడం కడతారనే నమ్మకంతో ఉన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తూ ఉండడం, ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా ప్రజలకే ప్రభుత్వ పథకాలు, సొమ్ములు అందే విధంగా చేయడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని జగన్ లెక్కలు వేసుకుంటున్నారు.ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్తో కూస్తో వ్యతిరేకత ఉందనే సర్వే రిపోర్టులు బయటకు రావడంతో, వారిని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

ఇంకా మెరుగైన పరిపాలనను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో పాటు రాబోయే ఎన్నికల ప్రచారంలో తప్పకుండా మాకే ఓటు వేయాలని జనాలను అడగకుండా, మేము జనాలకి మేలు చేస్తున్నాము అనుకుంటేనే ఓటు వేయండి అనే నినాదంతో జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారట వైసిపి ప్రభుత్వంలో తమకు లబ్ధి చేకూరింది అనుకుంటేనే ఓటు వేయాల్సిందిగా జనాలకు ఇప్పటికే జగన్ ఆప్షన్ ఇచ్చారు.ఇక ఎన్నికల సమయంలోనూ ఇదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు.

రైతు భీమా వంటి పథకాలతో పాటు, అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై సంతృప్తి పెరిగిందని, సర్వే రిపోర్ట్ ల ద్వారా జగన్ అంచనా వేస్తున్నారు.తాము చెప్పిన ప్రతి మాటను గుర్తుంచుకున్నానని , మరిచిపోలేదని, పేదరికం నుంచి ప్రజలు బయటపడాలన్నదే తన ధ్యేయమని జగన్ పదేపదే చెబుతున్నారు.జనాల్లో తమ ప్రభుత్వంపై పూర్తిగా సంతృప్తి ఉందని నమ్ముతున్న జగన్ ఇప్పుడు వైసీపీకి ఓటు వేయాలో లేదో జనాలకే ఆప్షన్ ను ఇస్తున్నారు.