ఏపీ సీఎం జగన్ నిర్వహించతలపెట్టిన ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశాలకు బ్రేక్ పడిందా.? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శల తర్వాత కార్యకర్తల్లో ఉత్సహం నింపేలా నియోజక వర్గాల వారీగా జగన్ ముఖ్య కార్యకర్తలను పిలిపించి మాట్లాడే కార్యక్రమం పెట్టుకున్నారు.ఇప్పటికే రెండు నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడారు.
అయితే ఈ కార్యక్రమం దాదాపు రోజూ ఉంటుందని మొదట వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175కి మొత్తం సీట్లు దక్కించుకోవాలని జగన్ తన పార్టీ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఈ నేపథ్యంలోనే ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలను తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసుకు పిలిపించి మాట్లాడుతున్నారు.
అయితే ఇప్పటివరకు సీఎం జగన్ రెండు నియోజకవర్గాల కార్యకర్తలతోనే మాట్లాడారు.మొదట టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై దృష్టిపెట్టారు.
వైఎస్ జగన్.కుప్పంలో ఇప్పటికే పంచాయతీ మండల జిల్లా పరిషత్లు మున్సిపాలిటీని కైవసం చేసుకుని టీడీపీకి షాక్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని డిసైడ్ అయ్యారు.ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన 50 మంది క్రియాశీలక కార్యకర్తలతో సీఎం జగన్ మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు.
పులివెందుల తర్వాత తనకు రెండో నియోజకవర్గం కుప్పమని తేల్చిచెప్పారు.కుప్పంలో ఈసారి భరత్ ను గెలిపించాలని కోరారు.
రెండే సమీక్షలు.

ఇక కుప్పం తర్వాత ఇక జిల్లాలవారీగా ఉత్తరాంధ్ర నుంచి సమీక్షలు మొదలుపెట్టారు.ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో సీఎం జగన్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.
అయితే ఇక ఈ రెండు నియోజకవర్గాల తర్వాత జగన్ సమీక్షలు ఆపేశారు.దీంతో ఎమ్మెల్యేలు.
ముఖ్యం కార్యకర్తలు నిరాశ చెందుతున్నారని అంటున్నారు.మరోవైపు నియోజకవర్గాల సమీక్షల పుణ్యమా అని సీఎంను కలిసి తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఎమ్మెల్యేలు ఆశపడితే.
సీఎం రెండు నియోజకవర్గాల సమీక్షలతోనే సరిపెట్టారని బాధపడుతున్నట్టు చెబుతున్నారు.అయితే సీఎం జగన్ గత కొద్ది రోజులుగా వేర్వేరు కార్యక్రమాలతో బిజీగా ఉండటం తదితర కారణాలతో తాత్కాలికంగా సమీక్షలకు విరామమిచ్చారని అంటున్నారు.
త్వరలోనే రాష్ట్రంలో మిగిలిన 173 నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని చెబుతున్నారు.చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…
.