Jagan: వాళ్లతో పోల్చితే .. జగన్ కు ఈ తలనొప్పులు తక్కువే ?

ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు,  175 స్థానాలకు 175 గెలుచుకుని ఏపీలో తమకు తిరుగులేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో జగన్( jagan ) అనేక నిర్ణయాలు తీసుకున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలామంది పై ప్రజల్లో వ్యతిరేకత ఉండడం,  అనేక అవినీతి ఆరోపణలు రావడం,  తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వారిని మార్చే విషయంలో ఎటువంటి మొహమాటలకు వెళ్లలేదు.

 Jagan Has Fewer Headaches Compared To Them-TeluguStop.com

కచ్చితంగా ప్రజాబలం ఉన్న నాయకులు, గెలుస్తారు అనుకున్న వారినే అభ్యర్థులుగా జగన్ ఎంపిక చేశారు.గెలుపే ప్రామాణికంగా జగన్ అడుగులు వేశారు.

పార్టీలో కీలక నాయకులనుకున్న వారు , టికెట్ దక్కే అవకాశం లేదనుకున్నవారు ముందుగానే పార్టీ మారడంతో పాటు,  జగన్ పైన,  వైసీపీ( YCP ) పైన అనే విమర్శలు చేసినా జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదు.

Telugu Ap, Jagan, Jaganheadaches, Janasenani, Pavan Kalyan, Telugudesam, Ysrcp-P

టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) ఉమ్మడిగా తమను ఎదుర్కొనేందుకు వస్తున్నా,  జగన్ ఎక్కడా ధైర్యం కోల్పోకుండా ఒంటరిగానే అన్ని పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు.15 మంది ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాల్లోకి మార్చారు.దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు.అయినా అక్కడ పరిస్థితులను చక్కదిద్దుకుని   గెలుపు ధీమాతోనే ఉన్నారు.  టిడిపి ,జనసేన , బిజెపి తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించిన తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.చాలామంది టికెట్ దక్కక అసంతృప్తితో పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు .

Telugu Ap, Jagan, Jaganheadaches, Janasenani, Pavan Kalyan, Telugudesam, Ysrcp-P

వైసీపీలో మొదట్లో ఈ తరహా వ్యవహారం కనిపించినా,  అసంతృప్త నేతలను బుజ్జగించి దారికి తెచ్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు.మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.25 లోక్ సభ స్థానాలకు గాను 24 పేర్లను ప్రకటించారు.అనకాపల్లి లోక్ సభ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇప్పటికే టిడిపి , జనసేన లో టికెట్ దక్కని వారు తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడి వైసీపీలో చేరుతుండగా , మరి కొంత మది ఆయా పార్టీల తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.టికెట్ల కేటాయింపు విషయంలో జగన్ ఎన్ని మార్పు చేర్పులు చేసినా ,  అలకలు, అసంతృప్తులు పెద్దగా రాకుండా జగన్ ముందుగానే జాగ్రత్త పడటం వంటివన్నీ వైసిపికి కలిసివచ్చే అంశాలే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube