ఏపీలో ప్రస్తుతం ఉన్న పోలిటికల్ హీట్ అంతా ఇంతా కాదు.ఓవైపు చంద్రబాబు అరెస్ట్ ( Chandrababu arrest )అంశం.
మరోవైపు ఎన్నికల కోలాహలం ఇంకోవైపు పొత్తులపై పాకులాట.ఇలా ప్రతి అంశం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతూనే ఉంది.
ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.వచ్చే ఏడాది ఏప్రెల్ లేదా మే లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలపై ఎలాంటి స్పష్టత లేదు.దానికి కారణమేంటో కూడా మనందరికి తెలిసిందే.
మోడి సర్కార్( Narendra Modi ) జమిలి ఎన్నికల వైపు అడుగులు వేస్తుండడంతో ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

దాంతో ఎలక్షన్స్ ( Jamili Elections )కోసం వెయిట్ చేస్తున్న అన్నీ రాష్ట్రాలు ఎప్పుడు మోడి వైపు చూస్తున్నాయి.ఇక ఏపీలో గత కొన్నాళ్లుగా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది.దానికి తోడు ఇప్పుడు జమిలి ఎన్నికల అంశం తెరపైకి రావడంతో వైఎస్ జగన్ ఎలక్షన్స్ విషయంలో కేంద్రానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
మొన్నటివరకు ముందస్తు ఎన్నికలకు ససేమిరా అన్న జగన్ సర్కార్.ఇటీవల జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పుకొచ్చింది.కానీ పార్లమెంట్ సమావేశాల్లో మోడి మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పడంతో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని తేలిపోయింది.

దాంతో జగన్( CM jagan ) కూడా ఎలక్షన్స్ పై తొందరేమి లేదు అన్నట్లుగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించారు.దీంతో మోడి ఎప్పుడు రెడీ అంటే అప్పుడే ఎలక్షన్స్ అని వైఎస్ జగన్ చెప్పకనే చెప్పారు. జమిలి ఎలక్షన్స్ అయినా ముందస్తూ ఎన్నికలైనా వేటికైనా సిద్దమే అని వైఎస్ జగన్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
దీంతో ఎలక్షన్స్ భారమంతా కేంద్రంపైనే వేసినట్లు తెలుస్తోంది.మరి గత ఎన్నికల్లో 151 సీట్లతో కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసిన వైసీపీ( YCP ) ఈసారి ఏకంగా 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది.
మరి జగన్ ఆ టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి.